Site icon HashtagU Telugu

Lunar Month Worship: నేడు జ్యేష్ఠమాసంలో రెండో మహా మంగళవారం…ఇలా పూజిస్తే సకల పీడలు పోతాయి…

జ్యేష్ఠ మాసంలో వస్తున్న రెండో మంగళవారం అత్యంత పవిత్రమైనది. నేడు హనుమంతుడికి అత్యంత ఇష్టమైన రోజు. దీనిని మహా మంగళవారం అని కూడా అంటారు. ప్రతి మంగళవారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, జ్యేష్ఠ మాసంలో వచ్చే మంగళవారం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. జ్యేష్ఠ మాసంలో రెండవ మంగళవారం అంటే ఈరోజు 24 మే 2022న జరుపుకుంటున్నారు. దీనిని మహా మంగళవారం అని కూడా అంటారు. ఈ రోజున హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా మనిషికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజు హనుమంతుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం.

నేడు హనుమంతుడి (పూజా విధి) ఆరాధన విధానాన్ని తెలుసుకోండి

>> ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
>> దీని తరువాత, పూజ గదిలో హనుమంతుడి విగ్రహాన్ని ఉంచండి.
>> తూర్పు దిక్కుకు అభిముఖంగా కూర్చోండి.
>> హనుమంతుడి విగ్రహానికి గంగాజలంతో స్నానం చేసి, ఆపై పంచామృతంతో స్నానం చేయించండి. చివరగా, శుభ్రమైన నీటితో కూడా స్నానం చేయించండి.
>> దీని తరువాత, హనుమంతుడి ముందు నెయ్యి దీపం వెలిగించి, వడలు, పాయసం సమర్పించండి.
>> తర్వాత తమలపాకులతో తాంబూలం కూడా హనుమంతుడికి పెట్టండి.
>> చివరగా, కర్పూరం వెలిగించి హనుమంతుని హారతి చేయండి. ఆపై హనుమాన్ జీని ముకుళిత హస్తాలతో ప్రార్థించండి.

ఒక వేళ మీకు ఇంట్లో పూజ చేసే అవకాశం లేకపోతే, మీ సమీపంలో ఉన్న హనుమంతుడి ఆలయానికి వెళ్లి, దండం పెట్టుకొని, కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతి వెలిగించి, మీ శక్తి కొలది దక్షిణ సమర్పించండి.

Exit mobile version