Diwali: దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని అలాగే విఘ్నేశ్వరుడిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. ఈరోజు చేసే దీపారాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత కూడా ఉంది. ఇకపోతే దీపావళి అంటేనే దీపాల పండుగ. మరి ఈ దీపాలను వెలిగించే సమయంలో చాలామందికి అనేక రకాల సందేహాలు నెలకొంటూ ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ ఏడాది దీపావళి పండుగ అక్టోబర్ 20, సోమవారం రోజు వచ్చింది. ఆ రోజున అందరూ ఇంటిని అందంగా చక్కగా అలంకరించుకుంటారు.
ఇకపోతే చాలా మందిలో ఉండే సందేహం ఏంటంటే, దీపావళికి దీపాలను వెలిగించేటప్పుడు వాటిని నేతితో వెలిగించాలా? లేక నూనెతో వెలిగించాలా అని, ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. భగవంతుడిని పూజించేటప్పుడు నేతితో దీపారాధన చేస్తే శ్రేష్టం అని చెబుతున్నారు. దీపావళి రోజు కూడా నేతితో దీపారాధన చేయవచ్చట. అలా చేయడం వలన సులువుగా భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చని,దీపావళి నాడు వినాయకుడిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తారు.
ఆ సమయంలో కూడా నేతితో దీపారాధన చేస్తే మంచిదని అలా చేయడం వల్ల జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు.
దీపావళి నాడు నేతితో దీపారాధన చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందట. సంతోషం, డబ్బు కలిగి, ఏ బాధ లేకుండా హాయిగా జీవించవచ్చని చెబుతున్నారు. అలాగే వినాయకుడికి నేతితో దీపారాధన చేయడం వలన విజయాలను అందుకోవచ్చట. కాబట్టి దీపావళికి నేతితో దీపారాధన చేయవచ్చని, దీని వలన సానుకూల ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు. అలాగే నూనె దీపాలను కూడా దీపావళి నాడు వెలిగించచ్చట. ప్రతి ఇంట్లో కూడా అన్ని మూలల్లో నూనె దీపాలను వెలిగిస్తారు. నేతితో దీపారాధన చేయడం కొంచెం ఖర్చుతో కూడుకున్నది అనుకునే వారు నూనెతో దీపాలను వెలిగించవచ్చట. ఉదయం, సాయంత్రం చాలామంది ఇళ్లల్లో నూనెతో దీపాలను వెలిగిస్తారు. నువ్వుల నూనె, వేరుశెనగ నూనె, ఆవాల నూనె వంటి నూనెలతో దీపారాధన చేయవచ్చని చెబుతున్నారు.
Diwali: దీపావళి రోజు ఏ దీపాలను వెలిగించాలి.. నూనె, నెయ్యి.. దేనిని ఉపయోగించాలో తెలుసా?

Diwali