Site icon HashtagU Telugu

Diwali 2024: దీపావళి పండుగ ఎప్పుడు.. తేదీ, పూజా సమయం ఇవే?

Diwali 2024

Diwali 2024

హిందువులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పండుగ దీపావళి పండుగ. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంతోమంది ఈ పండుగ కోసం ఏడాది నుంచి ఎక్సైటింగ్ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ పండుగ వచ్చింది అంటే చాలు ఇంటిని మొత్తం దీపాలతో అలంకరించడంతోపాటు, టపాసుల మోత మోగిస్తూ ఉంటారు. ఈ దీపావళి పండుగ రోజున కొత్త బట్టలు ధరించి లక్ష్మీదేవికి పూజ చేసి ఐదు ఆరోగ్యలను కల్గించమని కోరుకుంటూ ఉంటారు. ఈ ఏడాది దీపావళి పండగను అక్టోబరు 31 న జరుపుకోనున్నారు.

ఈరోజున సాయంత్రం 5.39 గంటలకు లక్ష్మీపూజ ప్రారంభం, సాయంత్రం 6.51 గంటలకు లక్ష్మీపూజ ముగింపు. ఇక ఈ దీపావళి పండుగ ఇల్లు ఆఫీసు అలాగే బిజినెస్ ఇలా ప్రతి ఒక్క ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. ప్రతికూల శక్తిని తొలగించడానికి మీ ఇంటి ప్రతి మూలను శుభ్రం చేయడం చాలా ముఖ్యం. మీ వంటగది, స్టోర్ రూమ్ ని తగిన విధంగా శుభ్రం చేయాలని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా వాస్తు శాస్త్ర ప్రకారం దీపావళి పండుగ రోజు మీరు ఉపయోగించని అద్దాలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బొమ్మలు, విరిగిపోయిన వస్తువులను బయట పారేయడం మంచిది.

మీ ఇంటి నుండి ఉపయోగించని, విరిగిన వస్తువులన్నింటినీ వెంటనే తొలగించడం మంచిదని చెబుతున్నారు. అలాగే మీ ఇంటిలోని ఈ ఉత్తరం కుబేర స్థానం. మీ ఇంటికి ఉత్తర, ఈశాన్య దిశలను చక్కగా, శుభ్రంగా, అద్భుతంగా, ఆకర్షణీయంగా , అందంగా ఉంచడం చాలా కీలకం. మీ బ్రహ్మస్థానాన్ని శుభ్రంగా ఉంచాలి. ఇంటి ఉత్తర దిశలో ఎలాంటి వాస్తు దోషాలు లేవని నిర్ధారించుకోవాలి.