దీపావళి పండుగ రోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని అలాగే మహాలక్ష్మి ఇంకొందరు శ్రీ విష్ణువుని పూజిస్తూ ఉంటారు. వీటి వీటితోపాటుగా ఇంకా చాలామంది దేవుళ్లను కూడా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవితో పాటు విగ్నేశ్వరుని కూడా పూజిస్తూ ఉంటారు. అలాగే దీపావళి పండుగ రోజు రకరకాల వస్తువులను దానం చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటుగా ఒక ముఖ్యమైన వస్తువు కూడా ఉంది అని, ఆ వస్తువుని తప్పనిసరిగా పూజించాలని దీపావళి రోజు కొనుగోలు చేయాలని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వస్తువు ఏమిటి అన్న వివరాల్లోకి..అదే దక్షిణావర్తి శంఖం.
దీపావళి సందర్భంగా ఈ శంఖం కొనుగోలు చేసి తీసుకొచ్చి పూజలో ఉంచి, అప్పటి నుంచి ప్రతి శుక్రవారం పూజించాలి చెబుతున్నారు పండితులు. సముద్రం నుంచి లభించే శంఖానికి పురాణాల్లో ఎంతో విశిష్టమైన స్థానం కూడా ఉంది. అందుకే శ్రీ మహలక్ష్మితో పాటూ దీపావళి రోజు పూజలో ఈ శంఖాన్ని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయట. ఈ దక్షిణావర్తి శంఖం ఇంట్లో ఉంటే ఆహారానికి కొదువ ఉండదట. అన్ని శంఖాల్లో దక్షిణావర్తి శంఖాన్ని ఎలా గుర్తించాలనే సందేహం రావవచ్చు. సాధారణంగా సముద్రంలో కనిపించే శంఖాలన్నీ ఎడమ రెక్కలు ఉంటాయి. అంటే ఉదరం ఎడమ వైపు తెరిచి ఉంటుంది. కానీ దక్షిణావర్తి శంఖ ఉదరం కుడి వైపు ఉంటుంది. ఈ శంఖం మనకు బయట పూజ స్టోర్లలో తప్పకుండా లభిస్తూ ఉంటుంది.
అయితే దీపావళి రోజు ఈ దక్షిణావర్తి శంఖాన్ని తీసుకొచ్చి పూజించడం శుభప్రదంగా భావిస్తారు. అయితే వీటిని ఇంట్లో ఉంచి నిత్యం పూజించాలంటే కొన్ని నియమాలు కూడా ఉన్నాయట. ఎరుపురంగు వస్త్రాన్ని పరిచి దక్షిణావర్తి శంఖంలో గంగాజలం నింపి దానిపై ఉంచాలి. ఒక రోజంతా గంగాజలం తోనే ఉంచాలి. తర్వాత ఓం శ్రీ లక్ష్మీ బేతాయై నమః’ అనే మంత్రాన్ని జపించి,మరుసటి రోజు గంగా జలాన్ని తీసేసి ఎర్రటి గుడ్డలో చుట్టి ఉంచాలి. ప్రతి శుక్రవారం పూజ చేయాలి. ఎవరి ఇంట్లో అయితే దక్షిణావర్తి శంఖం ఉంటే వారిపై శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుందట. ఆర్థిక సంక్షోభాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. శంఖం శబ్ధం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందట. అలాగే ఈ దక్షిణావర్తి శంఖాన్ని నైరుతి దిశలో ఉంచడం వల్ల ఐశ్వర్యానికి లోటుండదట. ప్రాచీన భారతీయ సంస్కృతిలో శంఖానికి ప్రత్యేక స్థానం ఉందని, అందుకే ఆలయాల్లో హారతి ఇచ్చే సమయంలో శంకాన్ని ఊదుతూ ఉంటారు.