దీపావళి రోజున..ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని, గణేశుడిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈ సంవత్సరం దీపావళిని 24 అక్టోబర్ 2022 జరుపుకుంటారు. దీపావళినాడు, దేవుని పూజ తర్వాత ప్రసాదం ఇస్తుంటారు. కొన్నిసార్లు ఖిల్-బటాసేకి స్వీట్లు కూడా ప్రసాదం రూపంలో ఇస్తారు.
కానీ మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లాలో అలాంటి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఇక్కడ ప్రసాదం బంగారం , వెండి రూపంలోఇస్తుంటారు. అవును! లక్ష్మీదేవిని పూజించిన తర్వాత, దర్శనానికి వచ్చిన భక్తులకు బంగారం వెండితో చేసిన ఆభరణాలను ప్రసాదంగా ఇస్తారు. దీనితో పాటు ఇక్కడికి వచ్చేవారు లక్ష్మీదేవి ఆలయంలో బంగారం, వెండిని సమర్పిస్తారు. జీవితంలో విజయం సాధించాలని ప్రార్థిస్తారు. ఇలా చేయడం వల్ల సంవత్సరాంతంలో వారి ఆదాయం రెట్టింపు అవుతుందని నమ్ముతారు. ఈ అద్భుతమైన ఆలయం గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
ధన్తేరస్ రోజు మాత్రమే ఈ ఆలయ తలుపులు తెరుచుకుంటాయి:
మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో ఉన్న లక్ష్మీదేవి దేవాలయం ధన్‌తేరస్ రోజున మాత్రమే భక్తుల కోసం తెరవబడుతుంది. దీని తరువాత, మహాలక్ష్మికి 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. దీపావళి పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. మహాలక్ష్మి అలంకరణ కోసం ఇంటి నుండి నగలు తెచ్చే భక్తుడి ఆదాయం రెట్టింపు అవుతుందని.. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుందని నమ్ముతారు.
ఆలయ అలంకరణ:
దర్శనానికి వచ్చే భక్తులు ఆలయ అలంకరణ చూసి షాక్ అవ్వక తప్పదు. ఇక్కడ ఆలయం మొత్తం నోట్లు ,ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. దీని ఖరీదు సుమారు 100 కోట్ల వరకు ఉంటుంది. ఆలయ అలంకరణ కోసం భక్తులు భారీగా విరాళాలు ఇస్తారు. ఆ తర్వాత విరాళాలను భక్తులకు అందిస్తారు. రసీదు రూపంల వారికి అందిస్తారు. భాయ్ దూజ్ రోజున టోకెన్ తిరిగి ఇవ్వడంతో, డబ్బు, నగలు కూడా తిరిగి ఇస్తారు.
ప్రసాదంగా బంగారు, వెండి ఆభరణాలు.. స్వీట్లు దొరకవు:
ఈ ఆలయ విశేషమేమిటంటే, దీపావళి పండుగ సందర్భంగా సందర్శకులకు ఆభరణాలు, నగదు తదితరాలను ప్రసాదంగా అందజేస్తారు. ఈ ప్రసాదాన్ని స్వీకరించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. అయితే భక్తులు ఇక్కడ ప్రసాదంగా లభించిన ఆభరణాలను ఖర్చు చేయకుండా, వాటిని బీరువాలో దాచుకుంటారు. ఇలా చేయడం వల్ల నాలుగు రెట్లు పురోభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. ఇక్కడ బంగారం, వెండి తప్పా ప్రసాదంగా స్వీట్లు దొరకవు.