Flowers: ఈ పూలతో దేవుడిని పూజిస్తే చాలు.. మీ కోరికలు నెరవేరినట్టే?

సాధారణంగా పూజ చేయాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పూలు. కొంతమంది పూలు లేకపోయినా దీపం వెలిగించి

  • Written By:
  • Publish Date - November 24, 2022 / 06:30 AM IST

సాధారణంగా పూజ చేయాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పూలు. కొంతమంది పూలు లేకపోయినా దీపం వెలిగించి దేవుడికి నమస్కరించుకుంటూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం పూలు లేకుండా పూజ చేయడానికి కూడా ఇష్టపడరు. కొందరు అయితే దేవుడికి రకరకాల పూలను దండలుగా గుచ్చి దేవుళ్లకు వేసి నమస్కరించుకుంటూ ఉంటారు. హిందువులు ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడిని పూజించినట్టుగానే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకం పువ్వు అంటే ఇష్టమట. మరి ఏ దేవుడికి ఏ పువ్వు అంటే ఇష్టమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దతుర పుష్పం.. ఈ పువ్వుని ఉమ్మెత్త పువ్వు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఉమ్మెత్త పువ్వు అంటే శివుడికి చాలా ఇష్టం. శివునికి పూజ చేసినప్పుడు ఈ పువ్వును కచ్చితంగా శివునికి సమర్పించడం వల్ల తప్పక శివుడు కరుణిస్తాడు.

అలాగే కాళీమాతను పూజించినప్పుడు కాళీమాతకు ఎంతో ఇష్టమైన ఎర్రమందారం ని సమర్పించడం వల్ల అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. 108 ఎర్రటి మందారపు పూలతో అమ్మవారిని పూజించడం వల్ల ఎటువంటి కోరిక అయినా ఇట్టే నెరవేరుస్తుంది. అలాగే విష్ణువుకి కూడా ఎర్రమందారపు పూలు అంటే ఎంతో ఇష్టం. విష్ణువుని పూజించేటప్పుడు ఎర్ర మందారపు పూలతో పూజించడం వల్ల మంచి ఫలితాలను ఇస్తాడు. లక్ష్మీదేవికి కమలం లేదా తామర పువ్వు అంటే ఎంతో ఇష్టం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర పువ్వుతో పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అలాగే ఎటువంటి పూజకు అయినా ముందుగా పూజించే ఆ విఘ్నేశ్వరుడికి బంతిపూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి విగ్నేశ్వరుడిని పూజించేటప్పుడు బంతిపూలను సమర్పించడం వల్ల తప్పకుండా కోరిన కోరికలను నెరవేరుస్తాడు.

మరీ ముఖ్యంగా ఆరెంజ్ కలర్ బంతిపూలు అంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టం. పలాశ పువ్వు అంటే సరస్వతీ దేవికి ఎంతో ఇష్టం. అయితే ఈ పువ్వులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. సరస్వతీ దేవికి ఇష్టమైన ఈ పువ్వుని సమర్పించడం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అలాగే శ్రీకృష్ణుడిని పూజించేటప్పుడు తులసి ఆకులను ఒక దండలా గుచ్చి వాటిని శ్రీకృష్ణునికి సమర్పించడం వల్ల స్వామి ఎంతో సంతోషపడతాడు. మల్లెపూలు అంటే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టం. కాబట్టి ఆంజనేయస్వామిని పూజించేటప్పుడు ఐదు మల్లెపూలు ఆంజనేయ స్వామికి సమర్పించి కోరికను కోరితే అది తప్పకుండా నెరవేరుస్తాడు.