Flowers: కోరిన కోరికలు నెరవేరాలంటే దేవుళ్ళను ఈ పువ్వులతో పూజించాల్సిందే?

మామూలుగా మనం పూజ చేసేటప్పుడు దేవుడికి పూజకు పూలు ఉపయోగించడం అన్నది తప్పనిసరి. కొంతమంది పూలు లేకుండా పూజలు చేస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - August 27, 2023 / 09:17 PM IST

మామూలుగా మనం పూజ చేసేటప్పుడు దేవుడికి పూజకు పూలు ఉపయోగించడం అన్నది తప్పనిసరి. కొంతమంది పూలు లేకుండా పూజలు చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అసలు పువ్వులు లేకుండా పూజ చేయడానికి కూడా ఇష్టపడరు. పండితులు కూడా పువ్వు లేకుండా పూజ చేస్తే ఆ పూజ అసంతృప్తిగానే ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే హిందువులు ఎంతో మంది దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు.. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పువ్వు అంటే ఇష్టం ప్రీతికరం. అలా ఆ దేవుళ్లకు ఇష్టమైన పువ్వులతో పూజించడం ద్వారా కోరిన కోరికలను నెరవేరుస్తారు. మరి ఏ ఏ దేవుడిని ఎటువంటి పువ్వులతో పూజించడం వల్ల కోరిన కోరికలను నెరవేరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పరమేశ్వరుడికి ఉమ్మెత్త పువ్వు అంటే చాలా ఇష్టం. ఈ ఉమ్మెత్త పువ్వు ధతుర పుష్పం అని కూడా పిలుస్తారు. ఈ ఉమ్మెత్త పువ్వుతో పరమేశ్వరున్ని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరడంతో పాటు తప్పకుండా శివుడి అనుగ్రహం కలుగుతుంది. కాళికా మాతకు ఎర్రమందారం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆ పూలతో పూజిస్తే అమ్మవారు తప్పకుండా సంతోషిస్తారట. ఈ మందార పువ్వులను 108 తెచ్చి అమ్మవారిని పూజిస్టే ఎలాంటి కోరికైనా తీరుతుందట. అలాగే విష్ణుమూర్తికి పారిజాత పువ్వులు అంటే చాలా ఇష్టం. అయితే ఈ పారిజాత పువ్వులతో విష్ణుమూర్తిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరడంతో పాటు ఆయన సంతోషిస్తారు.

లక్ష్మీదేవికి కమల పూలు లేదా తామర పువ్వులు అంటే చాలా ఇష్టం. ఆ పువ్వులతో ఆమెను పూజించడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తుంది. అలాగే విగ్నేశ్వరుడి అనుగ్రహం కలగాలంటే ఆయనకు ఎంతో ఇష్టమైన బంతి పువ్వులతో పూజ చేయాలి. వీటిని కొన్ని ప్రదేశాలలో చండు పువ్వులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ బంతిపూల దండ అంటే వినాయకుడికి చాలా ఇష్టం. ఇందులో ముఖ్యంగా ఆరెంజ్ కలర్ బంతిపూలు అంటే వినాయకుడు ఇంకా ఎక్కువగా ఇష్టపడతాడు. చదువుల తల్లి సరస్వతి దేవి అనుగ్రహం కలగాలన్న కోరిన కోరికలు నెరవేరాలి అన్న తప్పకుండా సరస్వతి దేవికి పలాస పువ్వుతో పూజ చేయాల్సిందే. అలాగే శ్రీకృష్ణుడి అనుగ్రహం కలగాలంటే తులసిమాలను స్వామివారికి సమర్పించాలి. ఆంజనేయ స్వామికి ఎక్కువగా మల్లెపూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆయనకు ఎంతో ఇష్టమైన మళ్లీ పూలను దండలుగా గుచ్చి స్వామివారికి అలంకరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరడంతో పాటు ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.