Main Door Vastu: వాస్తు ప్రకారం ముఖ ద్వారం ఏ దిశలో ఉండాలో తెలుసా?

ఏ ఇంటికి అయినా ప్రధాన ద్వారం ముఖ్యమైనది చాలా కీలకమైనది. వాస్తు ప్రకారం గా కూడా ఈ ప్రధాన ముఖ ద్వారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే చాలామంది ఈ ముఖద్వారం విషయంలో అనేక రకాల వాస్తు చిట్కాలను కూడా పాటిస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - September 27, 2022 / 09:15 AM IST

ఏ ఇంటికి అయినా ప్రధాన ద్వారం ముఖ్యమైనది చాలా కీలకమైనది. వాస్తు ప్రకారం గా కూడా ఈ ప్రధాన ముఖ ద్వారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే చాలామంది ఈ ముఖద్వారం విషయంలో అనేక రకాల వాస్తు చిట్కాలను కూడా పాటిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే మన ఇంటి ముఖద్వారం నోటి లాంటిది అని చెప్పవచ్చు. చాలామంది వాస్తు శాస్త్రా నిపుణులను అడిగిమరీ వారికి నచ్చిన విధంగా ఈ ముఖద్వారాన్ని ఎంత అద్భుతంగా డిజైన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ముఖద్వారానికి దిశ కూడా ఉందండోయ్.

మరి ముఖద్వారం ఏ దిశగా ఉంటే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన ఇంటి ప్రధాన ముఖ ద్వారం నైరుతి దిశగా ఉంటే అటువంటి ఇంట్లో ఉండకపోవడం మంచిది. ఇలా మూల ప్రవేశ ద్వారం ఉండటం వల్ల దుష్టశక్తులు వస్తాయి. అయితే మొదట్లో బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత బందులో కష్టాలు మొదలవుతాయి. ఒకవేళ నైరుతి దిశగా ద్వారం ఉంటే ఎడమ చేతిలో గద ధరించిన హనుమంతుడి టైల్స్‌ను అతికించాలి. అలాగే ఆగ్నేయంకంగా ఉంటే అనారోగ్య సమస్యలు, కోర్టు వివాదాలు తలెత్తుతాయి. అటువంటి అప్పుడు గాయత్రి మంత్రం రాసిన స్టిక్కర్లను తలుపులకు బయటవైపు అతికించాలి.

ఇక దక్షిణ దిశగా ముఖ ద్వారం ఉంటే వివాదాలు అభిప్రాయ భేదాలు వస్తాయి. అలాంటప్పుడు హనుమంతుడి టైల్స్ ను డోర్ బయట ఉంచడం మంచిది. ఇక పశ్చిమ దిశ గా ముఖ ద్వారం ఉంటే ఆ ఇల్లు ఎంతో యాక్టివ్ గా ఎంజాయ్మెంట్ కావల్సిన జీని ఇస్తుంది. అందుకే జపాన్ లో ఇల్లు అన్ని కూడా పచ్చిమ ముఖంగానే ఉంటాయి. వాయువ్య దిశగా ప్రధాన ముఖద్వారం ఉండడం అంత మంచిది కాదు.