Tulasi Plant: ఇంట్లో ఎటువంటి తులసి మొక్కను పూజించాలో మీకు తెలుసా?

హిందువుల ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసి మొక్కను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

  • Written By:
  • Publish Date - July 14, 2023 / 09:10 PM IST

హిందువుల ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసి మొక్కను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. తులసి మొక్కను హిందువులు దేవత రూపంగా భావించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. తులసిని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే కార్తీకంలో కళ్యాణం కూడా జరిపిస్తుంటారు. అయితే తులసి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి రామ తులసి, రెండోది శ్యామ తులసి. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి?ఈ రెండు ముక్కలను ఏ మొక్కను ఇంట్లో పూజించాలి అన్న విషయంలో చాలా మంది తెలియక తికమక పడుతూ ఉంటారు. ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇంట్లో తులసి ఉండే పాజిటివ్ ఎనర్జీ ఇల్లంతా వ్యాపిస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీ నారాయణులు ఇద్దరు కొలువై ఉంటారు. తులసిని పూజిస్తే ఉభయ దేవతల అనుగ్రహం లభిస్తుంది. తులసి మొక్కలు రెండు రకాలు కాగా,అందులో ఒకటి రామ తులసి రెండోది శ్యామ తులసి. ఇందులో మొదటి రామ తులసి విషయానికి వస్తే.. ఈ రామ తులసి మొక్క ముదురు ఆకుపచ్చ రంగు ఆకులను కలిగి ఉంటుంది. దీని ఆకులు విశాలంగా ఉంటాయి. రామ తులసి రాముడికి చాలా ప్రీతిపాత్రమని చెబుతారు. అందుకే దీనికి రామతులసి అనే పేరు వచ్చింది. రామ తులసి ఆకులు మధురంగా ఉంటాయి. దీన్ని ఇంట్లో నాటుకోవడం చాలా శుభప్రదం. ఇది ఇంట్లో ఉంటే సంతోషం, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి.
శ్యామ తులసి విషయానికి వస్తే..

శ్యామ తులసి ఆకులు ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. లేదా కొద్దిగా ఊదా రంగులో కనిపిస్తాయి. రామ తులసితో పోలిస్తే తక్కువ తీపితో ఉంటుంది. శ్వాస సమస్యలు, చెవికి సంబంధించిన అనారోగ్యాలకు, చర్మ సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇంట్లో ఏ తులసి శుభప్రదం? అన్న విషయానికి వస్తే.. శాస్త్ర ప్రకారం రామ, శ్యామ తులసులు రెండింటికి వాటి ప్రాముఖ్యత ప్రత్యేకంగా ఉంటుంది. కనుక రెండు మొక్కలు ఇంట్లో నాటుకుంటే మరీ మంచిది. అయితే చాలా మంది రామ తులసిని ఎక్కువ మంది ఇంట్లో పెట్టుకుంటారు. తులసిని నాటేందుకు గురు, శుక్ర, శని వారాలు అత్యంత అనుకూలమైన రోజులు. ఈ రోజుల్లో తులసి నాటితే లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో ఆ ఇల్లు సమృద్దిగ ఉంటుంది. అలాగే ఏకాదశి, ఆదివారం, గ్రహణం రోజున, సోమవారం, బుధ వారం తులసిని కొత్తగా ఇంట్లో నాటకూడదు.