Site icon HashtagU Telugu

Krishna : కలలో చిన్ని కృష్ణుడు కనిపించాడా.. అయితే దాని అర్థం ఇదే?

Did You See Little Krishna In Your Dream.. But What Does It Mean..

Did You See Little Krishna In Your Dream.. But What Does It Mean..

Did you see little Krishna in your Dream? : మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు అనేక రకాల కలలు రావడం అన్నది సహజం. అయితే అందులో కొన్ని రకాల కలలు మాత్రమే మనకు గుర్తుంటాయి. అందులో కొన్ని పీడకలలు కావచ్చు లేదంటే మంచి కలలు కూడా కావచ్చు. అయితే స్వప్న శాస్త్ర ప్రకారం కలలు భవిష్యత్తుని సూచిస్తాయని చెబుతుంటారు. చాలా వరకు కలలో జరిగేవి నిజమవుతాయని కూడా చెబుతూ ఉంటారు. మామూలుగా మనకు కలలో దేవుళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. ఒక్కో దేవుడు కనిపించినప్పుడు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క సంకేతంగా భావించాలి. అయితే మీకు కలలో ఎప్పుడైనా చిన్నికృష్ణుడు (Krishna) కనిపించాడా. ఒకవేళ అలా కనిపించి ఉంటే దాని అర్థం ఏంటి? కృష్ణుడు (Krishna) కలలో కనిపించడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

చిన్ని కృష్ణుడు కలలో కనిపిస్తే తప్పకుండా ఆ కల ప్రాశస్త్యమైందే. చిన్ని కృష్ణుడు రకరకాల రూపాల్లో గోచరిస్తాడు. నవ్వుతూ కనిపిస్తే ఒక అర్థం ఉంటే కోపంగా ఉంటే మరో అర్థం. చిన్ని కృష్ణుడు కలలో కనిపిస్తే అది శుభసూచకం అని పండితులు చెబుతున్నారు. ఊయలలో ఊగుతున్న చిన్ని కృష్ణుడు కలలో కనిపిస్తే త్వరలో మీరు ఏదో పెద్ద విజయం సాధించబోతున్నారని అర్థం. అనుకున్న పనులన్నీ నెరవేరబోతున్నాయని అనుకునేందుకు ఈ కలను సంకేతంగా భావించవచ్చు. నవ్వుతున్న ప్రసన్న వదనంతో చిన్ని కృష్ణుడు కలలో వస్తే మీరు శత్రువులను ఓడించబోతున్నారని సంకేతం.

శత్రుత్వం మీద విజయం సాధించబోతున్నారని చెప్పేందుకు మందహాసంతో ఉన్న చిన్ని కృష్ణుడి రూపం కలలో కనిపిస్తుంది. కలలో చిన్ని కృష్ణుడు అలిగినట్టు కానీ, కోపంగా కానీ కనిపిస్తే వాళ్లు చేస్తున్న పూజలో ఏదో లోపం జరిగిందని అర్థం. కలలో చిన్ని కృష్ణుడు కనిపిస్తే చాలు ఆ ఇంట్లో సంతోషాలు వెల్లివెరియనున్నాయనేందుకు సూచన. పిల్లలకోసం తపిస్తున్న వారికి చిన్ని కృష్ణుడు కలలో కనిపిస్తే త్వరలో వారికి సంతానయోగం కలుగనున్నదని అర్థం. అతి త్వరలో వారింట్లో చిన్ని కృష్ణుడి ఆగమనం కలగనుందని తెలిపేందుకు గాను ఇలాంటి కలలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

Also Read:  Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్టంగా వడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఇవే..!