Site icon HashtagU Telugu

Salt: ఉప్పును చేతికి ఎందుకు ఇవ్వరు.. అలా ఇస్తే ఏమవుతుందో తెలుసా?

Pink or White Salt

Pink or White Salt

మామూలుగా ప్రతి ఒక్కరి వంట గదిలో ఉప్పు తప్పనిసరిగా ఉంటుంది. ఉప్పులేని ఇల్లు వంటగది దాదాపుగా ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క వంటలను తప్పనిసరిగా ఉప్పును ఉపయోగించాల్సిందే. ఉప్పు లేని వంటలు కూడా తినడానికి అసలు అవ్వదు. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఉప్పును పడవేయడం లేదంటే తొక్కడం లాంటివి అస్సలు చేయరు. ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి కూడా ఉంటుంది.

అంతేకాకుండా మనకున్న నెగిటివ్ ఎనర్జీ తొలగించాలి అన్న ఉప్పు ఉండాల్సిందే. అలాగే మన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీలు రావాలి అన్న అది ఉప్పు వల్ల సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఇకపోతే చాలామంది ఉప్పును ఇతరులకు ఇచ్చేటప్పుడు చేతికి అస్సలు ఇవ్వరు. అలాగే ఏ వస్తువులను దొంగలించినా సరే ఉప్పును మాత్రం దొంగలించరు. బయట మార్కెట్లో కిరణా షాపుల వద్ద ఉప్పును బస్తాలకు బస్తాలు బయటే ఉంచుతూ ఉంటారు. కానీ వాటిని ఎవరు ముట్టుకోరు. మరి అంత ఉప్పును దొంగతనం చేయవచ్చు కదా, చేస్తే ఏం జరుగుతుంది అన్న సందేహం చాలా మంది కలిగే ఉంటుంది.

ఈ విషయం పట్ల శాస్త్రీయమైన కారణాలు లేకపోయినప్పటికీ కొన్ని నమ్మకాలు ఉండటం వల్ల ఉప్పును ఎవరు దొంగలించరు. ఉప్పును బదులు ఇవ్వడం చేతితో ఇవ్వడం ఉప్పును అప్పుగా తెచ్చుకోవడం వంటివి చేయరు. ఉప్పును శనీశ్వరుడి సంకేతంగా భావిస్తారు. అలాగే కొందరు ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. అందుకే ఉప్పుని చేతుల నుంచి ఎవరు తీసుకోరు.