Site icon HashtagU Telugu

Home Cleaning: దీపం పెట్టిన తర్వాత ఇంటిని శుభ్రం చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Home Cleaning

Home Cleaning

ప్రస్తుత రోజుల్లో బిజీ బిజీ షెడ్యూల్ కారణంగా చాలామంది స్త్రీలు మనస్ఫూర్తిగా పూజలు చేసుకోవడానికి కూడా సమయం ఉండటం లేదు. ముఖ్యంగా ఉదయం సమయంలో ఆఫీసులకు వెళ్లే మహిళలకు ఇంటిని శుభ్రపరచుకుని పూజ చేయడానికి కుదరదు. ఒక వేళ పూజ చేసిన ఇంటి పనులు అలానే మిగిలిపోతాయి. అయితే కొందరు దీపం పెట్టిన తర్వాత ఇల్లు శుభ్రం చేస్తుంటారు. అలా చేయవచ్చా లేదా అనే సందేహాలు చాలామందిలో కలుగుతూ ఉంటాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే.. వాస్తవానికి ఏ స్త్రీ అయినా పురుషుడైనా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టబోయే ముందు ఇల్లు శుభ్రపరుచుకుని పూజా మందిరంలో, తులసికోట దగ్గర దీపారాధన చేసి తరువాత ఏ పనిమీద వెళ్ళిన శుభ ఫలితాలు లభిస్తాయి. కానీ అందుకు తగిన సమయం లేకపోవడం వల్ల చాలామంది ఆ పని చేయడమే మానేశారు.

స్త్రీ, పురుషులు ఇద్దరూ కలిసి ఉద్యోగానికి వెళ్లడంతో ఉదయాన్నే పూజ చేసి వెళ్తారు. వారు ఉద్యోగానికి వెళ్ళిన తరువాత పనివాళ్ళు వచ్చి ఇంటికి శుభ్రపరుస్తారు. కొందరు ఇంటి దగ్గర ఉండే స్త్రీలు భర్త పిల్లలు ఆఫీసుకి స్కూలుకు పంపిన తర్వాత నెమ్మదిగా పూజలు చేసుకుంటూ ఉంటారు. కానీ శాస్త్రం ప్రకారం ఇంటిని శుభ్రపరిచిన తరువాత పూజ చేయడం మంచిది. ఒకవేళ అలా కుదరని వాళ్ళు దీపారాధన వెలుగుతుండగా ఇంటిని శుభ్రపరచరాదు. దీపం కొండెక్కిన తర్వాత ఇంటిని శుభ్ర పరచుకోవచ్చు. దీపం వెలుగుతుండగా ఇంటిని శుభ్రం చేస్తే దేవతల ఆగ్రహానికి గురవుతాము. ఏ పని చేపట్టినా సకాలంలో జరగదు. అన్నింటిలోను నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. కష్టాలు మొదలవుతాయి. ఇలా శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే దేవతలు ఆగ్రహిస్తారు. కాబట్టి ఉదయం తొందరగా నిద్రలేచి సూర్యోదయానికి కంటే ముందు ఇంటిని శుభ్రపరచుకుని పూజ చేయడం మంచిది.

అదేవిధంగా ఉదయం 6 గంటల లోపు పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. సూర్యోదయానికి కంటే ముందు అమృత ఘడియలలో పూజ చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి అంతా మంచే జరుగుతుంది. ఉదయం 6 లోపు పూజ చేయడానికి కుదరని వాళ్ళు కనీసం 7 గంటల లోపయినా పూజ చేయడం మంచిది. దీపారాధన చేసిన తర్వాత దీపం వెలుగుతూ ఉండగా ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంటిని శుభ్రపరిచరాదు. ఇది శాస్త్రానికి విరుద్ధంగా భావిస్తారు. ఇలా చేస్తే ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అయితే దీపం కొండెక్కిన తర్వాత ఇంటిని శుభ్ర పరచుకోవచ్చు.