Mangalsutra: మంగళసూత్రం ఇతరులకు కనిపించకూడదా.. పండితులు ఏం చెబుతున్నారంటే?

భారతదేశంలో పెళ్లి అయిన స్త్రీలు కొన్ని రకాల విషయాలను తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అందులో మంగళసూత్రం

  • Written By:
  • Publish Date - December 3, 2022 / 06:00 AM IST

భారతదేశంలో పెళ్లి అయిన స్త్రీలు కొన్ని రకాల విషయాలను తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అందులో మంగళసూత్రం కూడా ఒకటి. పెళ్లి అయిన స్త్రీలు మంగళసూత్రాన్ని ఎదుటి వ్యక్తులకు కనిపించకుండా దాచుకుంటూ ఉంటారు. అలాగే వారి మెడలో ఉన్న మంగళసూత్రం ఏదైనా కారణాల వల్ల తెగిపోయినప్పుడు మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసేసి దాని బదులుగా ఒక పసుపు తాడును కట్టుకుంటారు. స్త్రీలు తాళిబొట్టుకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు అన్న విషయం తెలిసిందే. ఇదివరకటి కాలంలో మెడలో తాలిని నల్లటి మట్టితో తయారు చేసిన నల్లటి పూసలను ధరించేవారు.

ఆ మట్టితో చేసిన నల్లపూసలు చాతిపై ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని పీల్చుకునేవి. అంతే కాకుండా అవి పాలిచ్చే తల్లులలో పాలను కాపాడతాయని నమ్మేవారు. కానీ ఇప్పటి నల్లపూసలు వేసుకోవడమే చాలామంది మానేశారు. ప్రతి ఒక్కరూ మెడలో నల్లపూసలకు బదులుగా బంగారు తాలిని వేసుకోవడం మొదలుపెట్టేసారు. బంగారు గొలుసు వేసుకోవడం వల్ల మన శరీరంలోని వేడితో పాటు ఇంకా వేడిపెరిగి అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. ఇక ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు హృదయమధ్య భాగంలో అనాహత చక్రం ఉంది. గొంతు భాగంలో సుషుమ్న, మరియు మెడ భాగంలో విశుద్ధ చక్రం ఉంది.

ఈ చక్రాలపై నల్లపూసలు ఉన్నందువల్ల హృదయం, గొంతు భాగంలో ఉష్ణం సమతులనమై రోగాలు పరిహారమౌతాయి. అందుకే అటువంటి పవిత్రమైన మంగళసూత్రాన్ని భర్తకు తప్ప ఇతరులకు కనిపించేలా పైన వేసుకోకూడదు. తాలి పై వేరొకరి దృష్టి పడడం మంచిదికాదు. అయితే ఈమధ్య కాలంలో నల్లపూసల తాడును ప్రత్యేకంగా తయారు చేయించుకుంటున్నారు మహిళలు. ఇదివరకు మంగళసూత్యానికి నల్లటి పూసలను అమర్చేవారు. వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ నలుపు రంగును పక్కన పెడుతూ వచ్చారు, సరాసరి నల్లపూసలను మంగళ సూత్రానికి అమర్చడం పట్ల కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. కాబట్టి స్త్రీలు ఎప్పుడూ కూడా మంగళసూత్రం భర్తకు తప్ప ఇతరులకు కనిపించే విధంగా మెడలో వేసుకోకూడదు.