Dream: ఈ తొమ్మిది రకాల కలలు వస్తే చాలు.. కోటీశ్వరులు అవ్వడం ఖాయం?

సాధారణంగా మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని మంచి కలలు వస్తే

Published By: HashtagU Telugu Desk
Dream

Dream

సాధారణంగా మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని మంచి కలలు వస్తే మరికొన్ని పీడకలలు కూడా వస్తూ ఉంటాయి. చాలామంది పీడ కలలు వచ్చినప్పుడు భయపడిపోతూ ఉంటారు. అయితే స్వప్న శాస్త్ర ప్రకారం కలలు భవిష్యత్తును సూచిస్తాయి. ప్రతి ఒక కలకి కూడా ఒక అర్థం ఉంటుంది. అయితే మనకు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. వాటిలో ఈ తొమ్మిది రకాల కలలు మీరు భవిష్యత్తులో చాలా డబ్బు సంపాదిస్తారని అలాగే మంచి సంపన్నులు అవుతారు అనడానికి సంకేతాలుగా భావించవచ్చు. మరి మీకు వస్తున్న కలలలో ఈ తొమ్మిది రకాల కలలు వస్తున్నాయి లేదో ఒకసారి తెలుసుకోండి..

ఒకవేళ మీరు నిద్రపోతున్నప్పుడు కలలో భగవంతుడు కనిపించినట్లయితే అది చాలా మంచి సంకేతంగా భావించాలి. దేవుడు మీకు కలలో కనిపిస్తే భవిష్యత్తులో మీకు డబ్బు వస్తుందని అర్థం. వచ్చే డబ్బుని మీరు దేవుని చర్యల కోసం ఉపయోగించాలి. అలాగే కలలో గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా కల వస్తే లాభానికి సంకేతంగా చెప్పవచ్చు. అలాగే కొత్త ఉద్యోగానికి సంబంధించినదిగా కూడా చెప్పుకోవచ్చు. స్వారీ చేస్తున్నట్టుగా కల వస్తే అది భావించాలి. త్వరలోనే మీకు అదృష్టం పట్టబోతోంది డబ్బు రాబోతుందని అర్థం. కలలో నిచ్చెన ఎక్కుతున్నట్లు వస్తే భవిష్యత్తులో మేలు జరగబోతుందని అర్థం. అలాగే కలలో అగ్నిని చూడటం లేదా వంట చేయడం వంటివి కూడా శుభప్రదంగా భావించాలి.

దానివల్ల ఉద్యోగంలో పురోగతి సాధించడంతోపాటు ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరతాయని అర్థం. అదేవిధంగా కలలో డబ్బు లేదా వ్యాపారం చూస్తే రాబోయే కొద్ది రోజుల్లోనే మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించిన బోతున్నారని అర్థం. కలలో దానిమ్మ పండును తింటున్నట్టు వస్తే విధంగా భావించవచ్చు. పండ్లు తింటున్నట్టు లేదా పండ్లు పంచుకోవడం లాంటి కలలు వచ్చినప్పుడు అది ఆర్థిక సంస్కరణకు ప్రతీకగా చెప్పవచ్చు. కలలో పెరుగు లేదా పాలు భవిష్యత్తులో విజయాన్ని సూచిస్తాయి. అలాగే కలలో దాన్యం కుప్పగా కనిపించడం కూడా మంచిది. ఒకవేళ మీ కలలో రాజభవనం లేదా పెద్ద ఇంటిని సందర్శించడం శుభసూచకంగా భావించాలి. ఈ కల వస్తే భవిష్యత్తులో మీకు పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. ఇది మీ ఆస్తి వృద్ధి చెందుతుందనడానికి సంకేతం.

  Last Updated: 06 Jan 2023, 07:02 PM IST