India Pakistan War: గతంలో 1962 ఫిబ్రవరి 4, 5 తేదీల్లో షష్ట గ్రహ కూటమి ఏర్పడింది. ఆ ఏడాది రష్యా, అమెరికాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. అదే ఏడాది ఇండియా – చైనా యుద్ధం కూడా జరిగింది. 2019 డిసెంబర్ 25న షష్ట గ్రహ కూటమి ఏర్పడింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి విజృంభించింది. ఈసారి మార్చి 29న అమావాస్య యుక్త షష్ట గ్రహ కూటమి ఏర్పడింది. దీంతో పాటు సూర్యగ్రహణం కూడా వచ్చింది. షష్ట గ్రహ కూటమి వేళ మీనరాశిలో రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, శని ఆరు గ్రహాలు సంయోగం చెందాయి. షష్ఠగ్రహ కూటమి ప్రభావం 12 రాశుల వారిపై మే నెల 31 వరకు ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీనివల్ల భూకంపాలు, సునామీలు, యుద్ధాలు వచ్చే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న భారత్ – పాక్ యుద్దం కూడా షష్ఠగ్రహ కూటమి వల్లే వచ్చిందా అనే కోణంలో చర్చ జరుగుతోంది.
Also Read :Indian Army: పాకిస్తాన్ దాడుల వివరాలతో ‘ఎక్స్’లో భారత ఆర్మీ పోస్ట్
మే 18 వరకు విపత్కర పరిస్థితులు
జ్యోతిష్య పండితుల కథనం ప్రకారం.. ఈసారి షష్ఠగ్రహ కూటమి ప్రభావం వల్ల మే 18 వరకు విపత్కర పరిస్థితులు(India Pakistan War) తలెత్తే అవకాశం ఉంది. యూరప్‌లోనూ యుద్ధ భయాలు అలుముకుంటాయి. దీని ప్రభావం కుంభం, మీనం, మేషం, సింహం, వృశ్చికం, ధనస్సు రాశులపై ఉంటుంది. వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. వీరు ఉద్యోగ పరంగా, వ్యాపర పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. షష్ఠగ్రహ కూటమి వల్ల ఆర్థిక అస్థిరతలు, సామాజిక ఉద్రిక్తతలు, ప్రకృతి విపత్తులకు దారితీయొచ్చని కొందరు జ్యోతిష్యులు హెచ్చరించారు. 2021 ఫిబ్రవరిలో ఈవిధంగా గ్రహ కూటమి ఏర్పడిన సమయంలోనూ కొన్ని దుష్పరిణామాలు జరిగాయని గుర్తుచేశారు. అయితే దేశాల మధ్య యుద్ధాలకు షష్ఠగ్రహ కూటమి నేరుగా కారణమవుతుందని పంచాంగకర్తలు స్పష్టంగా చెప్పలేదు.
Also Read :Operation Sindoor : భారత్, పాక్ ఉద్రిక్తల్లో జోక్యం చేసుకోం – జేడీ వాన్స్
కుజుడు ప్రభావంతో దూకుడు పెరిగి..
‘‘కుజుడు (మంగళ గ్రహం) షష్ఠగ్రహ కూటమిలో ఉన్నప్పుడు దూకుడు స్వభావం ఆధిపత్యాన్ని పొందుతుంది. దీనివల్ల అంతర్జాతీయ సంబంధాలలో ఒత్తిడి పెరుగుతుంది. సైనిక సంఘర్షణలు తారస్థాయికి చేరుతాయి’’ అని పండితులు విశ్లేషించారు.‘‘ఈ ఏడాది మే 16 నుంచి సంవత్సరం చివరి వరకూ ప్రకృతి సమతుల్యత దెబ్బతినే ముప్పు ఉంది. జూన్ 7 నుంచి జులై 28 మధ్య బిహార్, వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి. జులై 29 నుంచి సెప్టెంబర్ 14 వరకూ భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో కరువు, ఆహారం కొరత, అంతర్గత వైషమ్యాలు పెరుగుతాయి’’ అని అంచనా వేశారు.