TTD: వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు.. ఘనంగా ధ్వజారోహణం

  • Written By:
  • Updated On - May 29, 2024 / 09:19 PM IST

TTD: కలియుగ దైవం వెంకటేశ్వరస్వామికి కొలువైన తిరుమల తిరుపతిలో నిత్యం పూజలు, అభిషేకాలు జరుగుతుంటాయి. ప్రతిరోజు నిత్యం పూజలు జరగడం ఇక్కడ అనవాయితీ. ఇక కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు కార్కటక లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో పార్థసారధి, సూపరింటెండెంట్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామిని బంగారు తిరుచ్చిపై శ్రీ చక్రతాళ్వార్, గరుడ ధ్వజపథంతో ఊరేగించారు. జూన్ 6న ముగియనున్న ఈ మెగా ధార్మిక కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. 29న పెద్దశేషవాహనం, 1న కల్యాణోత్సవం, 2న గరుడ వాహనం, 5న రథోత్సవం, 6న చక్రస్నానం నిర్వహించనున్నారు. కల్యాణోత్సవంలో పాల్గొనాలనుకునే గృహస్థులు రూ.750 చెల్లించి ఇద్దరిని అనుమతిస్తారు. ఈ సందర్భంగా టీటీడీకి చెందిన హెచ్డీపీపీ, అన్నమాచార్య ప్రాజెక్టులు ప్రత్యేక భక్తి కార్యక్రమాలను ఏర్పాటు చేశాయి.