ప్రతిఏడాది కృష్ణ పక్షత్రయోదశినాడు ధంతేరస్ ను జరుపుకుంటారు. ఈ రోజు కుబేరుడు, లక్ష్మీదేవితోపాటు ధన్వంతరిని పూజిస్తారు. ఈ సారి అక్టోబర్ 22న ధంతేరస్ పండగను జరపుకుంటున్నారు. ఈ రోజు దీపదాన్ కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు దీపం ఎందుకు దానం చేస్తారో తెలుసుకుందాం.
ధంతేరస్ రోజున యముడిని పూజించడం వల్ల అకాల మృత్యుభయం తొలగిపోతుందని నమ్ముతుంటారు. యవదేవతకు దీపదానం చేయడం ఈరోజు ప్రత్యేకత.
యమరాజు కోసం దీపదాన్.
ధంతేరాస్ రోజు యమరాజుకోసం దీపదానం చేస్తే..ఆ ఇంట్లో అకాల మరణం ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ధంతేరాజ్ రోజు సాయంత్రం ఇంటి ప్రధాన గుమ్మం వద్ద 13దీపాలు వెలిగించాలి. ఈ దీపాన్ని వెలిగించేందుకు ఇంట్లో ఉన్న పాత దీపాలను ఉపయోగిస్తారు. ఈ దీపాన్ని ఇంటికి బయట దక్షిణవైపు వెలిగించాలి. నిజానికి దక్షిణ దిక్కును యమ దిక్కుగా పరిగణిస్తారు. ఈరోజు ఇంట్లో దీపం వెలిగించడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతుంటారు.
దీపదాన్ ఎందుకు చేస్తారు
ధంతేరాస్ రోజునే దీపదానం ఎందుకు చేస్తారంటే..హేమ్ రాజుకు భార్య కుమారుడు ఉన్నారు. కుమారుడు జన్మించినప్పుడు జ్యోతిష్యులు నక్షత్రరాశిని లెక్కించి…మీ కుమారుడు వివాహం జరిగిన నాలుగో రోజు మరణిస్తారని చెబుతారు. ఈ విషయం తెలుసుకున్న రాజు యమునా నది ఒడ్డున ఉన్న గుహలో బ్రహ్మచారి రూపంలో బిడ్డను పెంచుతాడు. ఒకసారి మహారాజ్ హన్స్ చిన్న కుమార్తె యమునా తీరంలో తిరుగుతున్నప్పుడు బ్రహ్మచారి ఆకర్షితుడై ఆమెను గంధర్వునితో వివాహం చేసుకుంటాడు. కానీ ఆ యువరాజు వివాహం జరిగిన నాలుగో రోజే మరణించాడు.
భర్త మరణాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. కొత్త పెళ్లయిన ఆ మహిళ రోదనలు చూసిన నపుంసకుల గుండె తరుక్కుపోయింది. అప్పుడు ఒక నపుంసకుడు యమరాజును అకాల మరణాన్ని నివారించే మార్గం లేదా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు యమరాజు ఓ పరిష్కారంచెబుతాడు. ఏంటంటే…అకాల మరణం నుంచి విముక్తి పొందాలంటే ధంతేరాస్ రోజున పూజలు చేయడంతోపాటు దీపదానం కూడాచేయాలని చెబుతాడు. అలా చేస్తే అకాల మరణం ఉండదని చెబుతాడు. అప్పటి నుంచి ధంతేరాస్ నాడు యమరాజు పేరుతో దీపాలను దానం చేసే సంప్రదాయం కొనసాగుతోంది.
ధంతేరాస్ శుభసమయం
ధనత్రయోదశి లేదా ధంతేరస్ సమయంలో సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమయ్యే ప్రదోషకాలంలో లక్ష్మీపూజ చేయాలి. అక్టోబర్ 22 శనివారం నాడు ధంతేరాస్ ను పూజిస్తారు. ధంతేరాస్ శుభసమయం సాయంత్రం 5.44నుంచి 0.05వరకు. దీని కాల వ్యవధి 21నిమిషాలు ఉంటుంది. ప్రదోష కాల సమయం సాయంత్రం 5.44 నుంచి రాత్రి 8.16 వరకు ఉంటుంది. వృషభ కాల సమయం సాయంత్రం 6.58 నుంచి రాత్రి 8.54 వరకు ఉంటుంది.