Devotional Tree: భారత్ లో ఆధ్యాత్మిక శక్తి ఉన్న చెట్లు ఏవో తెలుసా? పూర్తి వివరాలు ఇవే!

భారతదేశ ఆధ్యాత్మికతకు ఒక భూమి లాంటిది అంటూ ఉంటారు. అందువల్లే ప్రపంచం నలమూలల నుండి ఆధ్యాత్మికత కోసం భారతదేశాన్ని సందర్శిస్తూ ఉంటారు. అయితే మన దేశంలో పురాతన

  • Written By:
  • Publish Date - August 31, 2022 / 06:36 AM IST

భారతదేశ ఆధ్యాత్మికతకు ఒక భూమి లాంటిది అంటూ ఉంటారు. అందువల్లే ప్రపంచం నలమూలల నుండి ఆధ్యాత్మికత కోసం భారతదేశాన్ని సందర్శిస్తూ ఉంటారు. అయితే మన దేశంలో పురాతన శిల్పకలలు, దేవాలయాలు అలాగే మతాలు మరియు ఆధ్యాత్మికత యొక్క సారాంశాలను ప్రతి రాష్ట్రంలోనూ కనుగొనవచ్చు. ఇకపోతే భారతదేశంలో కొన్ని చెట్లు పవిత్ర ఆధ్యాత్మిక శక్తులు కలిగి ఉన్నాయట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బేల్ చెట్టు లేదా బిల్ పత్రి చెట్టు అని పిలుస్తారు. ఈ ఆకును శివుని యొక్క పవిత్ర మొక్కగా కూడా భావిస్తారు. ఈ చెట్టు యొక్క ఆకులు చాలా మంచిదని చెబుతారు. మూడు ముఖాలు గల ఈ ఆకులు సృష్టి , సంరక్షణ, వినాశనాన్ని ప్రతీకగా దేవుడు పనితీరు పై చిహ్నంగా భావిస్తారు. అలాగే రావి చెట్టు ను మూలమునందు, శాఖలయందు, స్కంధమునందు, ఫలములందు సర్వత్రా అచ్యుతుడు సమస్త దేవతలలో కూడి వున్నాడని స్కందపురాణం చెబుతోంది. కాగా రావి చెట్టును విష్ణు రూపంగా చెబుతుంటారు. కాబట్టి రావి చెట్టు విష్ణువుగా, వేప చెట్టు మహాలక్ష్మిగా భావించి ఒకే పాదులో వేప చెట్టును, రావి చెట్టును పెంచి పెళ్లి కూడా చేస్తారు.

రావి చెట్టు ఇంతటి మహిమ తో కూడుకొని వుంది. అందువల్లే దీని పుల్లలను పవిత్రమైన యజ్ఞ యాగాదులకు మాత్రమే ఉపయోగిస్తారు. బ్యాంబు లేదా వెదురు చెట్టును శ్రీ కృష్ణుడుకి యొక్క పవిత్రమైన చెట్టుగా భవిస్తారు. పురాణాలలో శ్రీ కృష్ణుని వేణువును వెదురుతో తయారు చేసిందే అని చెబుతారు. అందువల్ల వెదురు చెట్టుకు శ్రీకృష్ణుడికి ఇచ్చినంత ప్రాతినిధ్యం నిస్తారు. గంధం చెట్టు తో కేవలం వాసన, బ్యూటీ వెనిఫిట్స్ మాత్రమే కాకుండా ఈ చెట్టు సూపర్ పవర్ కలిగి ఉంటుంది. ఈ చెట్టు పార్వతీ దేవి సంబంధించిన చెట్టుగా భావించి ఆరాధిస్తారు. గంధం పేస్ట్ తోనే గణేషుడిని స్రుష్టించడం జరిగిందని భావిస్తారు. అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు. భాంగ్ ట్రీ శివ ఆలయాలు,దేవాలయాలు ఉన్న ఏ ప్రదేశానికి వెళ్లిన ఆ ప్రదేశంలో సాధువులు భంగ్ కొడుతూ ఉంటారు.

అందువల్ల , భంగ్ చెట్టు, నిజంగా సంపద మరియు శ్రేయస్సును తీసుకొస్తుందని చెప్పబడుతున్నాయి. మహాశివరాత్రి పండుగ సమయంలో శివును పూజింపుటకు ఎక్కువగా భంగ్ చెట్టు ఆకులను ఉపయోగించడం లేదా పూజకు పెట్టడం లాంటివి చేస్తారు. కొబ్బరి చెట్టు భారతదేశంలో కొబ్బరి చెట్టును తొలగించడం దుశ్శకునంగా పరిగణిస్తారు. కొబ్బరి చెట్టును కూడా కల్ప వ్రుక్షం అంటుంటారు. మరియు ప్రతి యొక్క శుభకార్యాలకు, పూజలకు కొబ్బరి కాయలను ఉపయోగిస్తుంటారు.