Coconut: దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే అర్థం ఏంటి.. దేనికి సంకేతం!

హిందువులు ఏ శుభకార్యాన్ని మొదలు పెట్టాలి అన్న మొదట కొబ్బరికాయను కొట్టి పనులను మొదలు పెడుతూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - July 7, 2022 / 06:40 AM IST

హిందువులు ఏ శుభకార్యాన్ని మొదలు పెట్టాలి అన్న మొదట కొబ్బరికాయను కొట్టి పనులను మొదలు పెడుతూ ఉంటారు. అంతేకాకుండా హిందువులు ఏ శుభకార్యాన్ని చేయాలి అన్న, పూజలు చేయాలి అన్న కొబ్బరికాయకు మొదటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఏ చిన్న పూజ కానీ శుభకార్యం కానీ జరిగిన కొబ్బరికాయ లేకుండా నిర్వహించరు. అంతే కాకుండా ఇంట్లో పూజ చేసే సమయంలో గుడికి వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. ఇది చాలామంది కొబ్బరికాయను కొట్టినప్పుడు కుళ్ళిపోతే చాలా బాధపడుతూ మదన పడుతూ ఉంటారు.

కొబ్బరికాయ కుళ్ళిపోవడం అశుభంగా భావిస్తూ, కీడు జరుగుతుందని అని భావిస్తూ ఉంటారు. కానీ పురాణాల ప్రకారం ఎక్కడ కూడా కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆశుభం అని రాయలేదు. సాధారణంగా కొన్ని కొబ్బరికాయలు కుళ్లిపోయి ఉంటాయి. అదే విషయాన్ని మనకు తెలియదు కాబట్టి వాటిని దేవుడి దగ్గర కొడతాము. కానీ వాస్తవానికి దేవుడికి కొబ్బరికాయ పుష్పం ఫలం వీటిలో ఏది ఒకటి సమర్పిస్తే స్వీకరిస్తానని భగవంతుడు చెప్పాడు. అంతేకాకుండా అది ఎలా ఉన్నా పర్వాలేదు భక్తితో సమర్పిస్తే చాలు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. అందుకే కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయినప్పటికీ కూడా బాధపడాల్సిన అవసరం లేదు చింతాల్సిన అవసరం అంతకంటే లేదు.

ఎవరు కూడా కావాలనే కుళ్ళిపోయిన కొబ్బరికాయలు తీసుకువచ్చి కొట్టరు కదా. కబడ్డీ కొన్ని కొన్ని సార్లు మనకు తెలియకుండా అలా కొబ్బరికాయలు కుళ్లిపోతూ ఉంటాయి. ఇంకొందరు అయితే కొబ్బరికాయలో పువ్వు వస్తే అదృష్టం అని కుళ్ళిపోతే దురదృష్టమని భావిస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. దేవుడికి పూజ చేసేటప్పుడు భక్తిశ్రద్ధలతో భగవంతుని కొలిస్తే ఎటువంటి చింతలు కూడా దరిచేయకుండా అష్టైశ్వర్యాలతో,ఆయురారోగ్యాలతో సంతోషంగా, ఆనందంగా ఉంటారు.