Peacock Feather: మీ ఇంట్లో నెమలి పించం ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

నెమలి.. చూడడానికి ఎంతో అందంగా అద్భుతంగా ఉండే ఒక పక్షి. నెమలిని చూడగానే ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలు అయిపోతూ ఉంటారు. ఎక్కడైనా నెమలి కనిపిస్తే

  • Written By:
  • Publish Date - July 27, 2023 / 10:06 PM IST

నెమలి.. చూడడానికి ఎంతో అందంగా అద్భుతంగా ఉండే ఒక పక్షి. నెమలిని చూడగానే ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలు అయిపోతూ ఉంటారు. ఎక్కడైనా నెమలి కనిపిస్తే కళ్ళారపకుండా అలాగే చూడడంతో పాటు అద్భుతమైన దృశ్యాన్ని ఫోన్లలో చిత్రీకరిస్తూ ఉంటారు. కొంతమంది ఇంటిని అందంగా అలంకరించుకోవడం కోసం నెమలి ఫోటోలు నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారంగా కూడా నెమలి ఈక వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా నెమలి ఈక మన రోజు వారీ జీవితంలో ఇది చాలా సమస్యల్ని పోగొడుతుందని పండితులు చెబుతున్నారు. మరి నెమలి ఈకలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పిల్లలు సరిగా చదవకపోయినా, చురుగ్గా ఉండకపోయినా, వారికి నెమలి పించం ఇస్తే చాలు మార్పు వస్తుందంటున్నారు నిపుణులు. అలాగే చేపట్టిన ప్రాజెక్టులు, పనులు ఆలస్యమవుతుంటే నెమలి పించాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మార్పు కనిపిస్తుందంటున్నారు. కొంతమందికి రాహు దశ నడుస్తూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నీ ఇబ్బందులే ఉంటాయి. అలాంటి వారు రాత్రి పడుకునేటప్పుడు నెమలి పించంను తలగడ కింద పెట్టుకోవాలి. ఆ పించం వ్యతిరేక ప్రభావాల్ని దూరం చేస్తుంది. గ్రహాలు కలిసిరాకపోతే ఎవరికైనా కష్టాలు తప్పవు. అయితే ఇంట్లోని బెడ్‌రూంలో తూర్పువైపున లేదా ఈశాన్యం మూలలో నెమలి ఈకను ఉంచడం వల్ల అది పనుల్లో వేగం పెరిగేలా చేస్తుంది. ప్రాజెక్టులు కూడా సమయానికి పూర్తవుతాయట.

పిల్లలకు నెమలిపించం ఇస్తుంటారు. ఇది మంచి పని. ఎందుకంటే పుస్తకాల్లో నెమలి పించంను ఉంచడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. చదువుల్లో వెనకబడే చిన్నారులు, చదివింది వెంటనే తలకెక్కని పిల్లలు తమ పుస్తకాల్లో చిన్న చిన్న నెమలి పించాలు ఉంచుకుంటే అవి వారిలో చదువు పట్ల ఆసక్తిని పెంచుతాయట. వాస్తనెమలి పించం వాస్తు దోషాన్ని కూడా పోగొడుతుంది. ఇంటి గేటు ముందు వినాయకుడి విగ్రహంతో పాటు ఒక నెమలి ఈకను ఉంచాలి. ఇది వాస్తు దోషాన్ని పోగొట్టడమే కాదు. ఇంటి చుట్టుపక్కల నెగెటివ్ ఎనర్జీని కూడా తరిమికొడుతుంది. జన్మదినం, పుట్టిన సమయం, ప్రదేశం వంటి వాటి వల్ల కొన్ని సార్లు గ్రహ దోషాలు వెంటాడుతుంటాయి. అవి లేనిపోని సమస్యలు తెస్తుంటాయి. వాటికి చెక్ పెట్టాలంటే, నెమలి పించం కావాల్సిందే. దానిపై కొద్దికొద్దిగా నీరు చల్లుతూ జ్యోతిష్యులు చెప్పినట్లుగా 21 సార్లు మంత్రాలు చదవాలి. ఆ తర్వాత ఆ నెమలి పించాన్ని పూజ గదిలో రోజంతా ఉంచాలి. తర్వాతి రోజు నీటిలో ముంచాలి. ఇలా చేస్తే గ్రహ దోషాలు పోతాయి.