Site icon HashtagU Telugu

Yamunotri: యమునోత్రి వెళ్లే భక్తులకు కష్టాలు తీరిపోనున్నాయి!

Devotees who go to Yamunotri will end their troubles!

Yamunoti

యమునోత్రిని (Yamunotri) సందర్శించాలనుకునే భక్తులకు (Devotees) కేంద్ర ప్రభుత్వం శుభవార్త. ఆలయానికి వెళ్లే మార్గంలో రోప్ వే నిర్మాణానికి తాజాగా ఆమోదం తెలిపింది. దశాబ్దానికి పైనే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుకు ఎట్టకేలకు మోక్షం వచ్చింది . ఈ వేసవిలోనే ప్రాజెక్టు పనులు ప్రారంభించనున్నట్లు కేంద్రం తెలిపింది.

రెండేళ్లలో రోప్ వేను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఈ రోప్ వే ప్రాజెక్టు కోసం త్వరలో 3.8 హెక్టార్ల భూమిని కేటాయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ రోప్ వే నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే.. ఖర్సాలీ గ్రామం నుంచి ఆలయానికి జస్ట్ పదినిమిషాలలో చేరుకోవచ్చని చెబుతున్నారు.

ఈ మార్గంలో ప్రస్తుతం ప్రయాణించాలంటే ట్రెక్కింగ్ చేయాల్సిందే. దీనికి దాదాపు ఐదు గంటలు పడుతుందని, వృద్ధులకు చాలా కష్టంగా ఉంటుందని చెప్పారు. గతేడాది ఈ మార్గంలో ట్రెక్కింగ్ చేస్తూ మొత్తం 81 మంది భక్తులు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఖర్సాలీ గ్రామం నుంచి యమునోత్రి (Yamunotri) ఆలయం వరకు రోప్ వే నిర్మించాలంటూ చాలా కాలంగా స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2006లో నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ మధ్యలోనే పనులు ఆపేశారని  ఒకరు తెలిపారు.

Also Read:  Mumbai: ముంబైలో నిల్చుని టీ తాగుతుంటే.. 42వ అంతస్తు నుంచి జారిపడిన రాయి..