Site icon HashtagU Telugu

Ayodhya: మొట్టమొదటిసారి అయోధ్య రామ మందిరానికి అలాంటి కనుక ఇచ్చిన భక్త బృందం.. అదేంటో తెలుసా?

Mixcollage 31 Jan 2024 08 41 Pm 5946

Mixcollage 31 Jan 2024 08 41 Pm 5946

ఇటీవలే జనవరి 22వ తేదీన అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ సందర్భం కోసం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భారతీయులు ఎంతగానో ఎదురు చూశారు. అలా మొత్తానికి లక్షలాది హిందువుల రామమందిర కల సాకారమైంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభమైనప్పటి నుండి, భక్తులు వివిధ రూపాల్లో రామమందిరానికి విరాళాలు అందజేస్తున్నారు. దేశం నలుమూలల నుంచి రామమందిరానికి కానుకల వరద వెల్లువెత్తింది. భారీ తాళం చేయి, పంచధాతువులతో చేసిన అతిపెద్ద దీపం, భారీ గంట, వజ్రాల హారం, బంగారు పూత పూసిన బ్యాండ్, 108 అడుగుల అగరుబత్తీ, పాదుకె, వెండి ఇటుక తదితర వస్తువులు తీసుకొచ్చారు.

ఇప్పటికీ రాముల వారిపై ఉన్న భక్తిని చాటుకుంటూ వివిధ రూపాల్లో కానుకలను సమర్పిస్తున్నారు. కొందరు లక్షలు విలువ చేసే కానుకలను కూడా సమర్పిస్తున్నారు. తాజాగా కూడా భక్తుడు కూడా ఇంతవరకు ఎవరు ఇవ్వని ఒక అపురూపమైన కానుకను అందజేశారు. ఆ అపురూపమైన కానుక ఏంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్య పోవాల్సిందే. అఖిల భారత మోంగ్ సమాజ్ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు వెండి చీపురును బహుమతిగా ఇచ్చింది. ఏంటి వెండి చీపురా అని ఆశ్చర్యపోతున్నారా. మీరు విన్నది నిజమే.. ఆల్ ఇండియా మోంగ్ సమాజ్ బాల రాముని గర్భగుడిని శుభ్రం చేయడానికి 1.751 కిలోల బరువున్న వెండి చీపురును బహుమతిగా ఇచ్చింది.

 

ఈ వెండి చీపురు తయారీకి11 రోజుల సమయం పట్టిందట. చీపురు పైభాగంలో లక్ష్మీ దేవి చిత్రం కూడా చెక్కబడి ఉంటుంది. ఈ వెండి చీపురులో 108 పుల్లలు ఉన్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజంగా ఆ వీడియోని చూసిన రామ భక్తులు నిజంగా చాలా అద్భుతంగా ఉంది అంటూ ఆ వీడియోని తెగ వైరల్ చేయడంతో పాటు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.