Site icon HashtagU Telugu

Yadadri : వరుస సెలవులతో యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Yadadri

Yadadri

వరుస సెలవులు రావడంతో యాదాద్రి (Yadadri)కి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడం , అలాగే బస్సు ఫ్రీ సౌకర్యం ఉండడం తో రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు రావడంతో స్వామి వారి దర్శనానికి గంటల సమయం పడుతుంది. 150 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం, ఉచిత దర్శనంకి 4 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేసారు. ఒక్క యాదద్రే కాదు..రాష్ట్రంలోని అనేక ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

వరంగల్ భద్రకాళి దేవాలయానికి ఉదయం నుండే భక్తుల తాకిడి పెరిగింది. అమ్మ వారిని దర్శించుకునెందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లి మల్లికార్జున స్వామి వారి ఆలయంలో కూడా భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారికి పట్నాలు, బోనాలు సమర్పించి దర్శించుకుంటున్నారు. అలాగే వేములవాడ , కొండగట్టు , కురవి వీరభద్ర స్వామి , గుంజేడు ముసలమ్మా , మేడారం సమ్మక్క , సారక్క దేవాలయాలు ఇలా అన్ని కూడా భక్తులతో సందడిగా మారాయి.

Read Also : BRS Sweda Patram : కాంగ్రెస్ శ్వేత పత్రాల మీద కౌంటర్ ఇచ్చిన కేటీఆర్