Vastu: దేవినవరాత్రుల్లో ఈ వస్తువులను వెంటనే ఇంటికి తెచ్చుకోండి… అదృష్టం కలిసి వస్తుంది..!!

దేవినవరాత్రులు సందర్భంగా అనేక షాపింగ్ యాప్‌లు, మాల్స్, ఇతర ఆన్‌లైన్ యాప్‌లు ఎన్నో డిస్కౌంట్స్ ప్రకటిస్తుంటాయి

  • Written By:
  • Publish Date - September 20, 2022 / 07:00 AM IST

దేవినవరాత్రులు సందర్భంగా అనేక షాపింగ్ యాప్‌లు, మాల్స్, ఇతర ఆన్‌లైన్ యాప్‌లు ఎన్నో డిస్కౌంట్స్ ప్రకటిస్తుంటాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎన్నో ఆఫర్లు ప్రటిస్తుంటాయి. ఆఫర్లు అనగానే ఎన్నో వస్తువులను కొనుగోలు చేస్తుంటాం. కానీ పవిత్రమైన నవరాత్రుల సమయంలో మనం ఇంటికి ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయాలో తెలుసా. నవరాత్రుల్లో ఈ వస్తువులను కొనుగోలు చేస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. నవరాత్రుల్లో మనం ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయాలో తెలుసుకుందాం.

ఆవు నెయ్యి:
మీరు మంచి ఆరోగ్యం పొందాలంటే, నవరాత్రుల మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఎప్పుడైనా ఆవు నెయ్యి కొనుగోలు చేసుకుని ఇంటికి తీసుకురావాలి.

మట్టి ఇల్లు:
సొంత ఇల్లు కట్టుకోవాలన్నా, కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా చిన్న మట్టి ఇంటిని తీసుకొచ్చి పూజా మందిరంలో పెట్టి పూజ చేయండి.

ఎర్ర జండా:
మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటే, ఈ 9 రోజుల్లో ఏ సమయంలోనైనా జెండాను కొనుగోలు చేయండి, ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగును కొనుగోలు చేసి, తొమ్మిది రోజులు పూజించి, నవమి రోజున అమ్మవారి ఆలయంలో ఉంచండి.

వెండి వస్తువు:
ఏదైనా శుభప్రదమైన వెండి వస్తువును కొనుగోలుచేసి పూజగదిలో పెడితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వీలైతే, ఈ రోజున వెండితో చేసిన దుర్గాదేవి విగ్రహాన్ని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు.

కొబ్బరికాయ:
ఉద్యోగంలో ప్రమోషన్ కావాలంటే ముందుగా 3 కొబ్బరికాయలు తెచ్చి ఇంట్లో ఉంచి నవమి రోజు గుడిలో నైవేద్యంగా పెట్టండి. దీని ద్వారా మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందుతారు.

ధూపం:
ధూపం, సుగంధ ద్రవ్యాలు, అగరుబండలు, పత్తి లేదా ప్రకాశవంతమైన తెల్లని పదార్థాన్ని కొనుగోలు చేయండి.

మౌలి దారా:
నవరాత్రి రోజున మౌళి దారాన్ని కొని, దానిపై తొమ్మిది ముడులు కట్టి, దేవతకు సమర్పించి, ప్రతి పనిలో విజయం కోసం దానిని ఎప్పుడూ మీ వద్ద ఉంచుకోండి.

డబ్బు:
ఈ తొమ్మిది రోజులలో, మంగళముఖులకు దానం చేసి, వారి నుండి కొంత డబ్బు తీసుకోండి. వారి నుండి తీసుకున్న డబ్బును మీ పర్సులో ఉంచండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది. .

కుంకుమ:
మీ అదృష్టాన్ని పెంపొందించుకోవడానికి, కుంకమను కొనుగోలు చేసి, దానిని నవమి రోజున కాళీదేవికి సమర్పించండి.

నవరాత్రి పర్వదినాల సందర్భంగా పై వస్తువులను కొని ఇంట్లో ఉంచుకోవడం వల్ల దుర్గామాత అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుండి విముక్తి కూడా లభిస్తుందని నమ్ముతారు.