హిందువులు ప్రతి ఏడాది నవరాత్రులను జరుపుకుంటూ ఉంటారు. విజయదశమి పండుగకు తొమ్మిది రోజుల ముందు నుంచి నవరాత్రులు అనగా తొమ్మిది రోజులపాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అలా తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ అలంకరణలో పూజించి ఇక పదవ రోజు విజయదశమి పండుగను జరుపుకుంటూ ఉంటారు. నేటి నుంచి నవరాత్రి వేడుకలు మొదలు అయ్యాయి. ఇక నేడు అమ్మవారు శైలపుత్రి అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఇకపోతే ఈ నవరాత్రులలో అమ్మవారిని ఏ విధంగా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం మనపై కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అమ్మవారిని ఏ విధంగా పూజించినా కూడా మంచి ఫలితాలు కలుగుతాయట. అంటే కలశం, శీ చక్రం అమ్మవారి విగ్రహం లేదా ఫోటో ఇలా ఏ విధంగా పూజ చేసిన దుర్గాదేవినీ పూజించవచ్చును చెబుతున్నారు. అయితే మీరు చేసే పూజను బట్టి కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలని అప్పుడే దుర్గామాత సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందనీ చెబుతున్నారు పండితులు. ఒకవేళ మీరు కలశం కి పూజ చేస్తున్నట్లయితే.. శరన్నవరాత్రుల్లో భాగంగా ముఖ్యంగా కలశ పూజ నిర్వహించేవారు కొన్ని కఠిన నియమాలు పాటిస్తూ అత్యంత నియమ నిష్ఠలతో దుర్గమ్మను పూజించాలని చెబుతున్నారు. అంటే కలశం పెట్టుకొని దుర్గాదేవిని పూజించేవారు రోజూ మహా నైవేద్యం తప్పక పెట్టాలి.
అంటే మడి కట్టుకొని అన్నం, పప్పు, కూర, ఏదైనా పిండి వంటకం ఇలా అన్నీ వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాతే మీరు ఆహారం స్వీకరించాలనీ చెబుతున్నారు. దుర్గామాత విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసేవారు పూజా కార్యక్రమాలను నిర్వహించిన కూడా మహా నైవేద్యం సమర్పించాలనీ క్రమం తప్పకుండా నవరాత్రులు పూజ చేయాలని చెబుతున్నారు. ఇక శ్రీ చక్రం పెట్టుకుని పూజ చేసేవారు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలట. శ్రీచక్ర అర్చన చేసే వారు.. గురువు దగ్గర బాల మంత్రం స్వీకరించి ఉండాలి. అంటే అది బాలా త్రిపురసుందరి దేవికి సంబంధించిన ఒక మూల మంత్రం. ఆ మంత్రం జపిస్తూ నవరాత్రుల్లో శ్రీచక్ర అర్చన చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయనీ పండితులు చెబుతున్నారు. ఈ విధంగా చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతున్నారు.