Divine Trees: శనివారం సాయంత్రం ఈ చెట్టు కింద దీపం వెలిగిస్తే చాలు.. ఆ దోషాలన్నీ పరార్?

భారతదేశంలో హిందువులు కొన్ని రకాల చెట్లను దేవుళ్ళగా భావించి వాటిని భక్తిశ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. అటువంటి వాటిలో వేప, రావి,జిల్లేడు, అరటి ఇల

  • Written By:
  • Publish Date - June 2, 2023 / 05:30 PM IST

భారతదేశంలో హిందువులు కొన్ని రకాల చెట్లను దేవుళ్ళగా భావించి వాటిని భక్తిశ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. అటువంటి వాటిలో వేప, రావి,జిల్లేడు, అరటి ఇలా చాలా రకాల మొక్కలను పూజిస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్క ముక్కను ఒక్కొక్క రోజు పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ చెట్లను పూజించడం వల్ల ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని చెబుతున్నారు పండితులు. ఈ చెట్టుని పూజించడం వల్ల ఎటువంటి దోషాలు పోతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హిందువులు ఎక్కువగా పూజించే చెట్లలో రావి మొక్క కూడా ఒకటి.

అశ్వత్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. రావి చెట్టులో త్రిమూర్తులు ఉంటారు. ఈ వృక్షంలో మూలం వద్ద బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రభాగంలో శివుడు ఉంటారు. ఇక రావి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపం అని కూడా చెబుతుంటారు. అందుకే అశ్వత్థనారాయణుడు అని కూడా అంటారు. స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలుకు గాని దాని కొమ్మలకు ఎర్రని వస్త్రం, దారం కట్టే ఆచారం ఉంది. అలాగే ప్రతి శనివారం సంధ్యా సమయంలో రావి చెట్టు మొదల్లో దీపం వెలిగిస్తే జాతక దోషాలు తొలిగిపోతాయి.

అలాగే ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి.. హిందువులు వేపచెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. అందుకే విష్ణు రూపమైన రావి చెట్టుకు, లక్ష్మీ రూపమైన వేప చెట్టును ఒకే చోటకు చేర్చి వాటికి వివాహం చేసే ఆచారం కూడా ఉంది. ఉత్తర హిందు స్థానంలో వేప చెట్టును నీమారి దేవిగా వ్యవహరిస్తారు. కొన్ని శుద్ధి కార్యక్రమాల్లో వేప రెమ్మలను ఉపయోగిస్తారు. వేప చెట్టులో అణువణువూ ఔషధమే. జమ్మి చెట్టు దేవతా వృక్షాల్లో ఒకటి. సంస్కృతంలో దీన్ని శమీ వృక్షంగా పేర్కొంటారు. జమ్మి చెట్టును తాకడం కూడా పుణ్యప్రదమంటారు. శమి.. శత్రువులను నశింపజేస్తుందని, పాండవుల ఆయుధాలను మోసినదని, రామునికి ప్రియమైనదని దీని అర్థం. ఈ చెట్టు బెరడనును కుష్ఠు రోగం, గాయాలు సహా పలు రోగాలకు ఉపయోగిస్తారు.