Ayodhya – Bala Ramudu : బాల రాముడు ఎలాంటి అల్లరి, చిలిపి పనులు చేసాడో తెలుసా..?

  • Written By:
  • Publish Date - January 22, 2024 / 11:27 AM IST

కోట్లాది మంది ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మరికొన్ని నిమిషాలలో అయోధ్య (Ayodhya )లో రామ మందిరం (Ram Mandir) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. మధ్యాహ్నం 12:05 నిమిషాల నుంచి 1 గంటల వరకూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. అయితే యావత్ ప్రజలు , భక్తులు అయోధ్య కు సంబదించిన విశేషాలు , బాల రాముడు గురించి తెలుసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ఎన్నో విశేషాలు బయటకు వస్తున్న..ఇంకా ఎన్నో తెలుసుకోవాలని భక్తులు ఆత్రుత కనపరుస్తూ సెర్చ్ చేస్తున్నారు. అయితే వీటిలో బాల రాముడు చిన్న వయసులో ఏంచేసాడో కూడా తెలుసుకోవాలని చూస్తున్నారు. ఈ తరుణంలో కొన్ని చిలిపి పనులు బయటకు వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join.

చిన్న తనంలో బలరాముడు చేసిన చిలిపి , అల్లరి పనులు అన్ని ఇన్ని కావంటున్నారు. చిన్ని రాముడు అందరి కన్నా ముందు కేరింతలు కొడుతూ.. బోర్లా పడటం..మెల్లిగా పట్టుకుని నిలుచోవడం.. బుజ్జి బుజ్జి అడుగులు వేయడం.. మెల్లిగా నడవడం..ఇలా ఎన్నో చేసాడట. ఓ రోజు బాల రాముడు రాజ భవనంలో ఆడుకుంటూ ఉండగా.. చీకటి పడి ఆకాశంలో చంద్రబింబం పైకి వచ్చింది..అది పౌర్ణమి రోజు కావడంతో చంద్రుడు నిండుగా ఆకాశంలో మెరుస్తూ ఉన్నాడు.. అదే కాకుండా నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఆ వస్తువులతో ఆడుకుంటున్న ఈ బాల రాముడు అన్నీ విడిచి పెట్టి.. నాకు ఆ చందమామ కావాలని మారం చేసాడట. ఎంతమంది నచ్చజెప్పాలని ట్రై చేసిన మొండి పట్టిన రాముడు ఎవరి మాటలు వినలేదట.

ఆకాశంలో ఉన్న చందమామని నేల మీదకు తీసుకురావడం అసాధ్యం అని చెప్పడంతో .. బాల రాముడికి నచ్చలేదు.. నాకు ఆ చందమామే కావాలంటూ గట్టి గట్టిగా ఏడ్చాడు. అతన్ని ఆపడం ఎవరి వల్లా కాలేదు.. ఇంతలో ఒకరు ఒక బంగారు పళ్ళెంలో నీళ్ళు పోసి అతని ముందు పెట్టారు.. ఆ నీటిలో చంద్రుడు ప్రతిబింబం కనిపించడంతో.. అది చూసిన బాల రాముడు సంతోషంతో.. ఆ చందమామతో ఆటలు ఆడేవాడట..ఇలా ఎన్నో బాల రాముడు చేసాడని చెపుతున్నారు.

Read Also : Ram Mandir Inauguration : రామ మందిరం ప్రారంభంలో ఆ 84 సెకన్లే కీలకం..