తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వాళ్ళు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో TTD ఆలయాలు కట్టిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా తిరుమల(Tirumala) వెంకటేశ్వర స్వామికి జరిగినట్టే అన్ని రకాల పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఢిల్లీలో గోల్ మార్కెట్ వద్ద TTD వారి ఆలయం ఉంది. తాజాగా ఢిల్లీలోని TTD ఆలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి(Sri Venkateswara Swami) వారికి నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాల వివరాలను ప్రకటించారు.
ఢిల్లీలోని గోల్ మార్కెట్ వద్ద TTD ఆలయంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి మే 4 నుండి 12వ తేదీ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. మే 3న సాయంత్రం వార్షిక బ్రహ్మోత్సవాల అంకురార్పణం జరుగుతుంది. మే 4వ తేదీ ఉదయం 8.30 నుండి 9.30 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం చేస్తారు ఆలయ పూజారులు. ఇక బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. మే 13వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు.
ఢిల్లీలోని గోల్ మార్కెట్ వద్ద TTD ఆలయంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు ఇవే:
04-05-2023 ఉదయం – ధ్వజారోహణం
04-05-2023 రాత్రి – పెద్దశేష వాహనం
05-05-2023 ఉదయం – చిన్నశేష వాహనం
05-05-2023 రాత్రి – హంస వాహనం
06-05-2023 ఉదయం – సింహ వాహనం
06-05-2023 రాత్రి – ముత్యపుపందిరి వాహనం
07-05-2023 ఉదయం – కల్పవృక్ష వాహనం
07-05-2023 రాత్రి – సర్వభూపాల వాహనం
08-05-2023 ఉదయం – మోహినీ అవతారం
08-05-2023 సాయంత్రం – కల్యాణోత్సవం
08-05-2023 రాత్రి – గరుడ వాహనం
09-05-2023 ఉదయం – హనుమంత వాహనం
09-05-2023 రాత్రి – గజవాహనం
10-05-2023 ఉదయం – సూర్యప్రభ వాహనం
10-05-2023 రాత్రి – చంద్రప్రభ వాహనం
11-05-2023 ఉదయం – రథోత్సవం
11-05-2023 రాత్రి – అశ్వ వాహనం
12-05-2023 ఉదయం – చక్రస్నానం
12-05-2023 రాత్రి – ధ్వజావరోహణం జరగనున్నాయి. దీంతో ఢిల్లీలోని వేంకటేశ్వరస్వామి భక్తులు అధికసంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.