Site icon HashtagU Telugu

Trees: మీరు తరచూ పూజించే ఈ చెట్లలో దేవతలు నివసిస్తారని మీకు తెలుసా?

Mixcollage 05 Feb 2024 12 34 Pm 7279

Mixcollage 05 Feb 2024 12 34 Pm 7279

మామూలుగా హిందువులు దేవుళ్ళతో పాటు కొన్ని రకాల మొక్కలను కూడా పూజిస్తూ ఉంటారు. తులసి, అరటి, రావి, వేప, జిల్లేడు ఇలా ఎన్నో రకాల మొక్కలను పూజిస్తూ ఉంటారు. చెట్లు అలాగే మొక్కలలో దేవతలు నివసిస్తారని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. అందుకే మొక్కలను పరమ పవిత్రంగా భావించడంతోపాటు భక్తిశ్రద్ధలతో పూజలు కూడా చేస్తూ ఉంటారు. హిందూమత గ్రంధాల ప్రకారం ఏ దేవతలు ఏ చెట్లు మొక్కలలో నివసిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే మొక్కలలో తులసి మొక్క అత్యంత ముఖ్యమైనది. తులసి మొక్క విష్ణు మూర్తికి ప్రీతిపాత్రమైన మొక్కగా భావిస్తారు.

తులసి మొక్కలో లక్ష్మీ దేవి నివసిస్తుందని చెబుతారు. తులసి మొక్క ఇంట్లో ఉంటే సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయని చాలా మంది ప్రగాఢంగా విశ్వసిస్తారు. అలాగే హిందువులు పూజించే ముఖ్యమైన చెట్టు రావి చెట్టు. రావి చెట్టులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు అని హిందువులు నమ్ముతారు. ఈ చెట్టును కల్పవృక్షం అని కూడా పిలుస్తారు. చాలా మంది తమ జాతకంలో వున్న దోషాల నివారణకు రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. రావి చెట్టులో త్రిమూర్తులు ఉంటారని, రావి చెట్టును పూజిస్తే అన్ని పాపాలు పోతాయని చెప్తారు. మర్రిచెట్టు కూడా హిందువులు అత్యంత పవిత్రంగా భావించే వృక్షం. దీనిని వట వృక్షం అని కూడా అంటారు. మర్రి చెట్టులో శివుడు కొలువై ఉంటాడని చాలామంది ప్రగాఢంగా విశ్వసిస్తారు. వటసావిత్రి ఉపవాసం రోజున కూడా మర్రిచెట్టును పూజిస్తారు.

అశోక చెట్టును కూడా హిందువులు పూజనీయం గా భావిస్తారు. అశోకవృక్షం దుఃఖాన్ని తొలగిస్తుందని, అశోక వృక్షం లో శివుడు కొలువై ఉంటాడని నమ్ముతారు. శమీ వృక్షాన్ని జమ్మి చెట్టు అని కూడా అంటారు. ఈ జమ్మిచెట్టు శని దేవుడికి అత్యంత ప్రీతికరమైనది. శమీ వృక్షాన్ని పూజించడం ద్వారా శత్రువులపై విజయం సాధిస్తారు అని చెబుతారు. శమీ వృక్షాన్ని తాకటం ఎంతో పుణ్యప్రదమని జమ్మి చెట్టు రాముడికి ఎంతో ప్రియమైనది అని చెబుతారు. శమీ పాండవుల ఆయుధాలను మోసిందని చెబుతారు.