Site icon HashtagU Telugu

Sapathapadi : నవ దంపతులతో ఏడు అడుగులు వేయించడం వెనుక ఉన్న ఆంతర్యమిదే..

definitions of sapthapadi

definitions of sapthapadi

Sapathapadi : పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. కష్టమైనా, సుఖమైనా ఆలుమగలు కలిసి జీవించాలి. కానీ.. ఆధునిక కాలంలో చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు. అసలు పెళ్లికి, పెళ్లిలో వేసే ఏడు అడుగులు వెనుక పరమార్థం తెలియకుండా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. ఆ పెళ్లి కాస్తా మూన్నాళ్ల ముచ్చటగానే ఉంటుంది. పెళ్లిలో అగ్నిహోత్రం చుట్టూ వేసే ఏడుగుల్లో ఒక్కో అడుగుకి ఒక్కో అర్థం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. అవేంటో చూద్దాం.

తొలి అడుగు : ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు అంటూ నూతన వధూవరులచే తొలి అడుగు వేయిస్తారు. అంటే ఆ పరమాత్ముడైన విష్ణువు మన ఇద్దరినీ ఒక్కటి చేయుగాక అని దాని అర్థం.

రెండవ అడుగు : ద్వే వూర్జే విష్ణుః త్వా అన్వేతు అంటారు. అంటే మన ఇద్దరికీ శక్తి లభించేలా చేయుగాక అని అర్థం.

మూడవ అడుగు : త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు అంటూ మూడవ అడుగు వేయిస్తారు. అంటే.. వివాహ వ్రతసిద్ధికోసం విష్ణువు అనుగ్రహం లభించాలి అని అర్థం.

నాల్గవ అడుగు : చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు అంటూ నాల్గవ అడుగు వేయిస్తారు. అంటే విష్ణువు మనకు ఆనందాన్ని కలిగించు గాక అని దాని అర్థం.

ఐదవ అడుగు : పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు అంటూ ఐదవ అడుగు వేయిస్తారు. అంటే ఆ విష్ణువు మన ఇద్దరికీ పశుసంపదను అనుగ్రహించుగాక అని అర్థం.

ఆరవ అడుగు : షడృతుభ్యో విష్ణుః త్వా అన్వేతు అంటూ ఆరవ అడుగు వేయిస్తాయి. అంటే.. ఆరు రుతువులు మనకు సుఖమునిచ్చుగాక అని అర్థం.

ఏడవ అడుగు : సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు అంటూ ఏడవ అడుగు వేయిస్తారు. అంటే గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణువు అనుగ్రహించుగాక అని అర్థం.