మామూలుగా ఏ ఇంట అయితే నిత్య దీపారాధన ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతూ ఉంటారు. అంతే కాకుండా నిత్య దీపారాధన జరిగే ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెబుతుంటారు. అయితే దీపారాధన చేయడం మంచిదే కానీ కొన్ని రకాల పొరపాటున వసూలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి దీపారాధనలో తెలియకుండా చేసే ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఎప్పుడు కూడా స్టీలు కుందులలో దీపారాధన చేయకూడదట. అలాగే దీపాలను వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో వెలిగించడం మంచిది కాదట. దీపాలను ఎల్లప్పుడూ అగరబత్తితో మాత్రమే వెలిగించాలని చెబుతున్నారు. అలాగే ఒక వత్తితో దీపారాధన ఎప్పుడు చేయకూడదట.. ఇలా ఏక వత్తి దీపాన్ని శవం వద్ద మాత్రమే వెలిగిస్తారని చెబుతున్నారు. దీపారాధనకుందికి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేయాలట.
అలాగే విష్ణువుకు దీపం ఎల్లప్పుడూ కుడివైపు మాత్రమే ఉండాలట. ఎదురుగా ఉండకూడదని చెబుతున్నారు. ఒకవేళ మీరు వెలిగించిన దీపం కొండ ఎక్కితే అలాంటప్పుడు 108 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించి తిరిగి మళ్లీ ఆ దీపాన్ని వెలిగించవచ్చని చెబుతున్నారు. ఎప్పుడు కూడా నోటితో దీపాన్ని ఆర్పడం లాంటివి చేయకూడదు. దేవుళ్లకు ప్రదక్షిణలు చేసేటప్పుడు విఘ్నేశ్వరుడికి ఒక ప్రదక్షణ, పరమేశ్వరుడికి 3 ప్రదక్షణలు, సూర్య భగవానుడికి రెండు ప్రదక్షణలు, విష్ణుకు నాలుగు ప్రదక్షణలు, రావి చెట్టుకు ఏడు ప్రదక్షణలు చేయాలని చెబుతున్నారు.