Site icon HashtagU Telugu

Garuda Purana: సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు నిర్వహించకూడదా.. గరుడ పురాణం ఏం చెబుతోందంటే!

Garuda Purana

Garuda Purana

మామూలుగా మరణాంతరం నిర్వహించే అంత్యక్రియలు ఆ తర్వాత జరిగే ఖర్మకాండల విషయంలో ఒక్కొక్కరు విధమైన సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ఒక ప్రదేశంలో ఒక్కొక్కరు ఒక్కో విధివిధానాలను పాటిస్తూ ఉంటారు. అయితే మరణాంతరం చేయాల్సిన వాటి గురించి గరుడ పురాణంలో చెప్పబడింది. అలాగే మరణం తర్వాత అది ఏం చేయకూడదు అన్న విషయం గురించి కూడా గరుడ పురాణంలో చెప్పారు. వాటిలో సూర్యాస్తమయం తరువాత అంత్యక్రియలు చేయకూడదు అన్న విషయం కూడా ఒకటి. మరి సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలను ఎందుకు నిర్వహించకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సూర్యా స్తమయం తర్వాత మృత దేహాన్ని దహనం చేయకూడదట.. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి ఆత్మకు శాంతి లభించదని చెబుతున్నారు. సూర్యా స్తమయం తర్వాత స్వర్గ ద్వారాలు మూసుకుపోతాయట. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత వ్యక్తి దహన సంస్కారాలు చేస్తే వారి ఆత్మ తన గమ్యాన్ని చేరుకోలేకపోతుందట. అలాగే సూర్యాస్తమయం తర్వాత నరకం ద్వారాలు తెరుచుకుంటాయట. అటువంటి పరిస్థితిలో మరణించిన వ్యక్తిని రాత్రి సమయంలో దహనం చేస్తే అతని ఆత్మ నరక బాధను అనుభవించవలసి ఉంటుందని, అంతేకాదు ఇలా సూర్యా స్తమయం తర్వాత అంత్యక్రియలు జరిపిన వ్యక్తి మరు జన్మలో శరీర భాగాలలో దేనిలోనైనా లోపంతో జన్మించే అవకాశం ఉందని చెబుతున్నారు.

అందువల్ల ఎవరికైనా సరే ఎటువంటి పరిస్తితిల్లోనూ రాత్రి సమయంలో అంత్యక్రియలు నిర్వహించరు. మరణించిన వ్యక్తి మృతదేహాన్ని సూర్యోదయం వరకు నేలపై ఉంచాలి. ఉదయం అతని అంత్యక్రియలు తగిన ఆచారాలతో నిర్వహించాలి. ఈ అంత్యక్రియలను తండ్రి, కొడుకు, సోదరుడు, మనవడు లేదా కుటుంబంలోని ఏ పురుష సభ్యుడైనా చేయవచ్చట. అందుకే మరణించిన తర్వాత చాలామంది అంతక్రియలను సూర్యాస్తమయం లోపే చేస్తూ ఉంటారు.