Site icon HashtagU Telugu

Puri Rath Yatra 2022: ఈ ఏడాది పూరీ జగన్నాథయాత్ర ఎప్పుడో తెలుసా..?

64977996

64977996

పూరీజగన్నాథ రథయాత్ర…ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. భారతదేశంలోని నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలలో పూరీ ఒకటి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది ఆషాడ మాసంలో రథయాత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది జూలై నెలలో 1వ తేదీ నుంచి 10రోజుల పాటు ఈ రథయాత్ర వేడుకలు జరగుతాయి. కోవిడ్ కారణంగా గతేడాది నామమాత్రపు భక్తులతోనే ఈ వేడుకలను నిర్వహించారు.

జగన్నాథుని రథయాత్ర…
హిందూ పంచాంగం ప్రకారం..ప్రతిఏడాది ఆషాడ మాసంలోని శుక్లపక్షంలో రెండో రోజున నిర్వహిస్తారు. 2022లో జగన్నాథుడి రథయాత్ర జూలై 1 వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. దేవశయని ఏకాదశి రోజు..ఈ యాత్ర ముగుస్తుంది. యాత్ర మొదటి రోజున జగన్నాథుడు ప్రసిద్ధ గుండిచ మాతా ఆలయాన్ని సందర్శిస్తాడు. కోవిడ్ కారణంగా ముగిసిన తర్వాత మొదటిసారిగా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది భక్తులను అనుమతించే అవకాశం కనిపిస్తోంది.

గతేడాదిలో…
గతేడాదిలో రథయాత్రను నిర్వహిస్తామని కొద్దిమంది భక్తులు, పండితులు ఈ రథయాత్రలో పాల్గొన్నారు. జగన్నాథుడి యాత్రకు గతంలో ఎవరైతే కోవిడ్ నెగెటివ్ రిపో్రటు తీసుకెళ్లారో…కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారే ఈ రథయాత్రకు అనుమతి ఉంటుంది.

రథయాత్ర ప్రాముఖ్యత…
పురాణాల ప్రకారం…విష్ణువు తన సోదరుడు బాలభద్ర, సోదరి సుభద్ర అవతారమైన జగన్నాథుడి రథయాత్ర పూరిలో నిర్వహిస్తారు. ఈ యాత్ర పదిరోజుల పాటు కన్నులపండవగా జరుగుతుంది. తలద్వజ అని పిలిచే బాలభద్ర రథం ఈ ప్రయాణంలో ముందు వరుసలో ఉంటుంది. మధ్య సుభద్ర రథం ఉంటుంది. వీటినే దర్వదాలన లేదా పద్మ రథం అని పిలుస్తారు. చివరగా నంది ఘెష్ అని పిలిచే జగన్నాథ రథం కదులుతుంది. ఈ రథయాత్రను ప్రత్యక్సంగా చూసిన వారికి పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. మరణం తర్వాత మోక్షం లభిస్తుందని చాలా మంది భక్తుల నమ్మకం.

అతిపెద్ద తీర్థయాత్ర…
భారతదేశంలోనే అతిపెద్ద తీర్థయాత్రల్లో ఇది ఒకటి. ఇది నాలుగో స్థానంలో ఉంది. ఈ ఆలయం 800ఏండ్లకు పైగా పురాతనమైంది. ఈ ఆలయం చుట్టూ నాలుగు గోడలు ఉంటాయి. ఈ ఆలయంలో జగన్నాథుడు తన సోదరుడు బాలభద్ర , సోదరి సుభద్ర దేవతలు తమ భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తారని భక్తులు నమ్ముతుంటారు.

ప్రతిఏడాది కొత్త రథాలు….
ఇక రథయాత్రలో మరో ప్రత్యేకత ఏంటంటే…ఇక్కడ ప్రతిఏడాది కొత్త రథాలను సిద్ధం చేస్తుంటారు. స్వచ్చమైన, నాణ్యత గల వేప చెక్కతో తయారు చేస్తారు. వీటిలో గోర్లు, ముళ్లు లేదంటే ఇతర లోహాలను ఉపయోగించరు. ఈ రథాన్ని మూడు రంగుల్లో తయారు చేస్తారు. జగన్నాథుని రథం ఎత్తు 45అడుగుల వరకు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి. రథయాత్రకు కేవలం 15రోజుల ముందు జగన్నాథుడు అనారోగ్యానికి గురయ్యాడని..ఆ దేవుడు కోలుకున్న తర్వాతే ఈ ఊరేగింపుతో బయటకు వచ్చినట్లు పురాణాల్లో ఉంది.

రథాన్ని లాగడం…
ఈ యాత్రలో పాల్గొని ఆ జగన్నాథుడి రథాన్ని లాగిన భక్తులు వంద యాగాలు చేసిన ఫలితం లభిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. అంతేకాదు ఈ యాత్రలో పాల్గొన్నవారికి మోక్షం లభిస్తుంది. అందుకే జగన్నాథుని యాత్రలో పాల్గొనేందుకు దేశం నుంచి నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఆషాడ మాసంలో పూరీపుణ్యక్షేత్రంలో స్నానం చేయడం వల్ల సకల తీర్థాలను దర్శించిన పుణ్యంఫలం లభిస్తుందని..శివలోకం ప్రాప్తిస్తుందని పురాణాల్లో ఉంది.