Magha Masam Significance: మాఘ మాసంలో ఇలాంటి పనులు చేస్తే చాలు.. పుణ్యఫలం దక్కడం ఖాయం!

హిందువులు మాఘమాసంను చాలా ప్రత్యేకమైనదిగా భావించడంతో పాటు మాఘ మాసం మొత్తం కూడా మాంసాహారం తీసుకోకుండా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉం

  • Written By:
  • Updated On - February 15, 2024 / 09:16 PM IST

హిందువులు మాఘమాసంను చాలా ప్రత్యేకమైనదిగా భావించడంతో పాటు మాఘ మాసం మొత్తం కూడా మాంసాహారం తీసుకోకుండా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా మాఘ మాసంలో కృష్ణుడు, విష్ణువు పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. నదీ స్నానాలు ఆచరించడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే వీటితోపాటుగా మాఘమాసంలో మరికొన్ని పనులు చేస్తే పుణ్యఫలం దక్కుతుంది అంటున్నారు పండితులు. ఇంతకీ అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాఘమాసంలో పుణ్య నదీ స్నానం, దానం, తర్పణం వంటివి ఆచరించే వారికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుందట.

మాఘమాసంలో ఉదయాన్నే నువ్వులతో దీపారాధన చేసిన వారికి అలాగే నువ్వులతో హోమం, నువ్వులు దానము వంటివి చేసిన వారికి ఆయురారోగ్యాలతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుందట. మాఘమాసంలో పుణ్య నదీస్నానాలకు ఎంతటి ప్రాధాన్యం ఉన్నదో దానమునకు కూడా అంతే విశేషమైనది. మాఘ మాస శుద్ధ విదియ నాడు బెల్లమును దానము చేయడము, ఉప్పును దానము చేయడము వలన శుభాలు కలుగుతాయని, పుణ్యం కలుగుతుందని మాఘ పురాణం స్పష్టంగా తెలియజేసింది. మాఘమాసంలో చవితిరోజు ఉమాదేవిని, విఘ్నేశ్వరుని పూజించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు లభిస్తాయి.

మాఘ మాస శుక్ల పక్ష పంచమి శ్రీపంచమి రోజు సరస్వతి దేవిని పూజించడం వలన సరస్వతీ కటాక్షం సిద్ధిస్తుంది.
మాఘమాస శుద్ధ షష్ఠి, మందారషష్ఠి, కామ షష్ఠి, వరుణ షష్ఠి రోజు వరుణ దేవుడిని మందారం వంటి ఎర్రపూలతో, ఎర్ర చందనంతో పూజిస్తారు. మాఘ మాస శుద్ధ సస్తమి రథ సప్తమి రోజు చేసే సూర్య ఆరాధనకు ఆరోగ్యప్రాప్తి కలుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగుతాయి. మాఘమాస శుద్ధ అష్టమిని భీష్మాష్టమి అని ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. మాఘమాసంలో భీష్మ అష్టమి నుంచి భీష్మ ఏకాదశి వరకు విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది.