Site icon HashtagU Telugu

Ram Mandir: అయోధ్యలో బాల రాముడి దర్శన సమయాలలో మార్పులు చేసిన అధికారులు?

362625 5 Lakh Devotees Visited Ayodhya Ram On The First Day

362625 5 Lakh Devotees Visited Ayodhya Ram On The First Day

ప్రస్తుతం అయోధ్య భక్తులతో కిక్కిరిసిపోతోంది. దాదాపు 500 సంవత్సరాల తర్వాత రామనామ జన్మభూమి మొత్తం పులకించిపోతుంది. ఆ ప్రదేశం అంతా కూడా రామ భక్తులతో కిటకిటలాడడంతో పాటు రామనామస్మరణతో మారు మోగిపోతోంది. ఈనెల 22 న బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగగా, ప్రాణ ప్రతిష్ట రోజు కేవలం విఐపి లకు మాత్రమే దర్శనం ఉండడంతో సామాన్య భక్తులకు 23 అనగా నిన్నటి నుంచి దర్శనాలకు అనుమతినిచ్చారు అధికారులు. దీంతో అయోధ్యను దర్శించుకోడానికి రామ భక్తులంతా తహతహలాడుతున్నారు. ఆలయాన్ని తెరిచిన తొలిరోజే దాదాపు ఐదు లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకున్నారు.

రామాలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న దృష్ట్యా ఆలయ నిర్వాహకులు దర్శనం సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆలయంలో భక్తులను చేయడానికి పోలీసు సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. నిన్నటి రోజున అయితే ఒక్కసారిగా భక్తులు భారీగా రావడంతో కాసేపు తొక్కిసలాట జరిగిందని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా ఆలయ అధికారులు దర్శన సమయాలను పొడిగిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు భక్తులు రాత్రి 7:00 గంటలకు బదులుగా రాత్రి 10:00 గంటల వరకు రామ్ లల్లా దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఉదయం పూట దర్శనాలు ఉదయం 7 నుండి 11.30 వరకు ఆలయం తెరిచి ఉంటుందట.

ఇక, అధికారిక వర్గాల ప్రకారం, ఆలయంలో దర్శనం కోసం సుమారు ఐదు లక్షల మంది భక్తులు అయోధ్యలో విడిది చేస్తున్నారని చెప్పారు. అయితే మరో 10-15 రోజుల తర్వాత అయోధ్యకు వచ్చి రామ్ లల్లా దర్శనం చేసుకోవాలని అయోధ్య జిల్లా యంత్రాంగం భక్తులకు విజ్ఞప్తి చేసింది. అయోధ్య రామాలయం దర్శనానికి వస్తున్న భక్తుల రద్దీ నేపథ్యంలో అక్కడి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎనిమిది వేల మందికి పైగా పోలీసులు ఈ వ్యవస్థను పర్యవేక్షిస్తుండటం గమనార్హం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్ కూడా పరిస్థితిని పర్యవేక్షించడానికి అయోధ్యలో క్యాంప్ చేస్తున్నారు. ఇప్పట్లో అయోధ్యకు చేరుకునే భక్తులు కాస్త అక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అయోధ్యకు చేరుకోవాలనిఅధికారులు వెల్లడిస్తున్నారు.