Sri Kamakshi Ammavaru: శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారి దర్శనం

కంచి లో ఉన్న ప్రముఖ దేవాలయం అంటేనే తొలిగా తెలిసే పేరు కాంచీపురం, కాంజీవరం, కంచి వంటి పేర్లతో పిలిచే వారు.

కంచి లో ఉన్న ప్రముఖ దేవాలయం అంటేనే తొలిగా తెలిసే పేరు కాంచీపురం, కాంజీవరం, కంచి వంటి పేర్లతో పిలిచే వారు . ఈ నగరం చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన పవిత్రమైన నగరాల్లో ఒకటి. మధురై లోని మీనాక్షి అమ్మవారి ఆలయం, తిరుచిరాపల్లి సమీపంలోని తిరువనైకవిల్ అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయం, కంచి కామాక్షమ్మ (Sri Kamakshi Ammavaru) దేవాలయం తమిళనాట పేరు పొందిన అమ్మవారి ఆలయాలు. కంచి అనగా మొల, చూల, వడ్డాణం అని అర్ధం, ఈ ఆలయాన్ని కాంచీపురం రాజధానిగా పరిపాలించిన పల్లవ రాజులు కట్టించారని ప్రసిద్ధి . ఇది అమ్మవారి అష్టాదశ 18 శక్తి పీఠాలలో ఒక పీఠం , అమ్మ వారి నాభి భాగం ఇక్కడ ఉందని ప్రతీతి .ఇక్కడ అమ్మవారు పద్మాసనం తో యోగ ముద్రలో ఉండటం ప్రత్యేకత . ఐదు ఎకరాల స్థలంలో , నాలుగు విశాలమైన గోపురాలతో ఒక పెద్ద తటాకముతో విస్తరించబడినది.

ఈ దేవాలయము సమీపాన వరాహ రూపమైన మహావిష్ణు (తిరు కాల్వనూర్ దివ్యదేశ) దేవాలయం ఉండేది గుడి శిధిలం కావటం వలన మూల విగ్రహాన్ని కంచి కామాక్షి అమ్మవారి (Sri Kamakshi Ammavaru) దేవాలయంలో పునః ప్రతిష్టించారు. ఈ దేవాలయంలో గర్భగుడి ఎదుట గాయత్రీ మండపం , అరూపలక్ష్మి , స్వరూపాలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి. అమ్మ వారి విగ్రహం ముందు ఉగ్రరూపంనుండి శాంత పరచటానికి , జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన శ్రీచక్ర యంత్రం ఉంది. కామాక్షి ఆలయానికి శ్రీ కంచి కామకోటి పీఠం, దాని తరువాత వచ్చిన శంకరా చార్యులతో తో దగ్గరి సంబంధం ఉంది. ఈ ఆలయంలో ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర యొక్క గ్యాలరీ ఉంది. కామాక్షి (Sri Kamakshi Ammavaru) దేవత ప్రధాన దేవత, ఈ ఆలయం యాభై ఒకటి శక్తి పీఠాలలో ఒకటి.

ఇక్కడ అమ్మవారిని పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తారు , పద్మాసన భంగిమ లో యోగ ముద్రలో ఉంటారు . తన ఎడమ చేతిలో చెరకు గడ ,చిలుకను తన కుడి చేతిలో పట్టుకుంది. దేవత తన చేతుల్లో పాశ , అంకుశాన్ని ధరించి ఉంటారు. శివుడిని వివాహం చేసుకోవడానికి కామక్షి దేవత ఇసుకతో చేసిన శివలింగంతో మామిడి చెట్టు కింద తపస్సు చేయగా శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై పార్వతి యొక్క దైవిక రూపమైన కామాక్షి దేవతను వివాహం చేసుకున్నాడని చరిత్ర..

ఆలయంలో ప్రతి రోజు నాలుగు ఆరాధన సేవలు జరుగుతాయి . వార్షిక పండుగ ఫిబ్రవరి మధ్య నుండి మార్చి మధ్య వరకు మాసి తమిళ మాసం వసంతకాలం లో వస్తుంది. ఈ సమయంలో రథోత్సవం , తెప్పోత్సవం జరుగుతాయి. తమిళ మాసమైన వైకాసిలో నవరాత్రి, ఆడి, ఐపాసి మాసంలో , శంకర జయంతి ,వసంత ఉత్సవాలు జరుగుతాయి.

Also Read:  Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం మరణానికి ముందు కనిపించే సంకేతాలి