Temple: 200 ఏళ్ల నాటి దేవాలయంలోకి తొలిసారి ప్రవేశించిన దళితులు..!

తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో తొలిసారిగా దళితులు 22 ఏళ్ల నాటి దేవాలయంలోకి ప్రవేశించారు. గట్టు మేళాలతో, డ్రమ్స్ తో వీరు మొదటిసారి అడుగుపెట్టి దేవునికి పూజలు చేశారు.

Published By: HashtagU Telugu Desk
02janth Temple

02janth Temple

Temple: తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో తొలిసారిగా దళితులు 22 ఏళ్ల నాటి దేవాలయంలోకి ప్రవేశించారు. గట్టు మేళాలతో, డ్రమ్స్ తో వీరు మొదటిసారి అడుగుపెట్టి దేవునికి పూజలు చేశారు. ఇప్పటికే దేశంలో ఎన్నో చోట్ల దళితులను చాలా ఆలయాల్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వట్లేదు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం అయినా కూడా ఎన్నోచోట్ల దురదృష్టకరంగా ఈ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. అయితే ఇక్కడ మాత్రం దళితులు తమ ప్రవేశం కోసం తీవ్రమైన నిరసనలకు దిగారు.

తమకి అనుమతి ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేయగా చివరికి హిందూ రిలీజియస్, చారిటబుల్ ఎండోమెంట్ శాఖ నుంచి జిల్లా కలెక్టర్ శ్రవణ్ కుమార్, మరో అధికారికి డైరెక్షన్స్ వచ్చాయి. సత్వరమే దళితులను దేవాలయంలోకి ప్రవేశం కల్పించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇక వారి ఆదేశాల మేరకు సోమవారం తొలి ఏకాదశి రోజున దళితులు అధికారుల సమక్షంలోనికి ప్రవేశించారు. అక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకూడదు అని 300 మంది పోలీసులు భద్రత రీత్యా మోహరించారు.

తమిళనాడులో ఇలా గత పది రోజుల్లో ఆలయంలోకి దళితుల ప్రవేశం జరగడం రెండవసారి. మొదటిసారి ముందు వెంగైవాయల్ గ్రామంలో పుదుకొట్టై కలెక్టర్ కవిత రాము, ఇతర అధికారుల సహాయంతో అయ్యన్నార్ దేవాలయంలోకి వారి ప్రవేశం జరిగింది. తరాలు మారుతున్నా… కొంతమంది మూఢనమ్మకాలు మారకపోవడం వల్ల ఇలా దళితులపై వివక్ష జరుగుతుంది. అయితే 200 ఏళ్ళు నాటి వైభవం ఉన్న దేవాలయంలోకి దళితులు ప్రవేశించడంతో ఇకనైనా ఈ వివక్షకు పూర్తిగా అడ్డుకట్టపడుతుందని ఆశిద్దాం.

  Last Updated: 02 Jan 2023, 07:29 PM IST