Site icon HashtagU Telugu

Astrology : ఈ రాశివారికి అతిథుల రాకతో ఖర్చులు పెరిగే అవకాశం

Astrology

Astrology

Astrology : శనివారం రోజున చంద్రుడు శని స్వరాశి కుంభంలో సంచరిస్తున్నాడు. ఈ రోజు ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. కుంభరాశిలో బుధుడు, సూర్యుడు, చంద్రుడు కలిసి త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరచనున్నారు. అలాగే, బుధుడు పూర్వాభాద్ర నక్షత్రంలో సంచారం చేయనుండగా, కుజుడి ప్రభావంతో లక్ష్మీ యోగం ఏర్పడనుంది. ఈ ప్రత్యేక గ్రహస్థితుల కారణంగా కొన్ని రాశుల వారికి శుభఫలితాలు, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కలగవచ్చు.

మేష రాశి (Aries)
వ్యాపార సంబంధిత ముఖ్యమైన ఒప్పందాలను ఖరారు చేసుకునే అవకాశం ఉంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగవచ్చు.
అదృష్ట శాతం: 77%
పరిహారం: విష్ణు జపమాలను 108 సార్లు జపించాలి.

వృషభ రాశి (Taurus)
వ్యాపారంలో మార్పులు చేయడం ద్వారా లాభాలుంటాయి. కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కుటుంబంతో మతపరమైన ప్రదేశాన్ని సందర్శించే అవకాశం.
అదృష్ట శాతం: 64%
పరిహారం: బ్రాహ్మణులకు దానధర్మాలు చేయాలి.

మిధున రాశి (Gemini)
కొత్త వ్యాపార ప్రణాళికలు రూపొందించాలి. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. శ్రామికులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి.
అదృష్ట శాతం: 66%
పరిహారం: ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించాలి.

కర్కాటక రాశి (Cancer)
పెండింగ్ పనులను పూర్తి చేసుకోవడానికి మంచి రోజు. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు సానుకూల ఫలితాలు.
అదృష్ట శాతం: 87%
పరిహారం: శివయ్యకు తెల్ల చందనం సమర్పించాలి.

సింహ రాశి (Leo)
బిజీగా గడిపే రోజు. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేసే అవకాశం
.అదృష్ట శాతం: 90%
పరిహారం: తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి.

కన్య రాశి (Virgo)
అదృష్టం అనుకూలంగా ఉంటుంది. వివాదాల నుండి దూరంగా ఉండాలి. ధైర్యంగా ముందుకెళ్లాలి.
అదృష్ట శాతం: 88%
పరిహారం: శని దేవుడిని దర్శించి ఆవాల నూనె సమర్పించాలి.

తులా రాశి (Libra)
కొత్త ప్రాజెక్ట్ లు విజయవంతమవుతాయి. కుటుంబ ఆస్తులకు సంబంధించి కోర్టు వ్యవహారాల్లో విజయం.
అదృష్ట శాతం: 65%
పరిహారం: ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలి.

వృశ్చిక రాశి (Scorpio)
లాభదాయక అవకాశాలు వస్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి.
అదృష్ట శాతం: 91%
పరిహారం: సరస్వతీ దేవిని పూజించాలి.

ధనస్సు రాశి (Sagittarius)
ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.
అదృష్ట శాతం: 72%
పరిహారం: వినాయకుడికి లడ్డూలను సమర్పించాలి.

మకర రాశి (Capricorn)
ఉద్యోగాలలో మంచి ఫలితాలు. పెండింగ్ పనులు పూర్తవుతాయి.
అదృష్ట శాతం: 93%
పరిహారం: శ్రీ కృష్ణుడిని పూజించాలి.

కుంభ రాశి (Aquarius)
నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి.
అదృష్ట శాతం: 98%
పరిహారం: యోగా, ప్రాణాయామ సాధన చేయాలి.

మీన రాశి (Pisces)
అతిథుల రాకతో ఖర్చులు పెరిగే అవకాశం. వ్యాపారాలలో నష్టాలకు అవకాశముంది.
అదృష్ట శాతం: 62%
పరిహారం: పార్వతీ దేవిని పూజించాలి.

(గమనిక: ఈ జ్యోతిష్య ఫలితాలు నమ్మకాలకు ఆధారంగా అందించబడినవి. సర్వాంగసంపూర్ణ ఫలితాల కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి.)

Read Also : Gold Price Today : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..