Site icon HashtagU Telugu

Ayodhya: అయోధ్య వీఐపీ ఎంట్రీ టికెట్ పేరుతో మోసాలు.. మీకు అలాంటి మెసేజ్ వచ్చిందా.. అయితే జాగ్రత్త?

Mixcollage 12 Jan 2024 01 43 Pm 6066

Mixcollage 12 Jan 2024 01 43 Pm 6066

ప్రస్తుత రోజుల్లో మోసగాళ్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అమాయకమైన ప్రజలను మోసం చేద్దామా అని కొందరు కేటుగాళ్లు మోసగాళ్లు ఎదురుచూస్తున్నారు. చిన్న చిన్న సందర్భాలను కూడా వారికి అవకాశంగా మలుచుకొని డబ్బులు కాజేసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. చివరికి అయోధ్య రామ మందిరం పేరుతో కూడా చాలామంది అనేక రకాల మోసాలకు దారుణాలకు పాల్పడుతున్నారు. అటువంటి వాటిలో టికెట్ల పేరుతో జరుగుతున్న నకిలీ మెసేజ్ల మోసం కూడా ఒకటి. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే. ఇక 22వ తేదీ ఎక్కడికి వెళ్లడం కోసం చాలామంది నానా తిప్పలు పడుతున్నారు.

దాన్ని అవకాశం గా తీసుకున్న కొందరు కేటుగాళ్లు వీఐపీ ఎంట్రీ టికెట్లను ఉచితంగా అందిస్తామని స్కామర్లు మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఇంతకీ ఆ మెసేజ్ లో ఏముంది అన్న విషయానికి వస్తే.. ప్రజలకు వస్తున్న వాట్సాప్‌ మెసేజ్‌లలో రామ్ జన్మభూమి గృహసంపర్క్ అభియాన్.APK అని లేబుల్ చేసిన APK ఫైల్ ఉంటుంది. తర్వాత రెండో మెసేజ్‌లో రామ జన్మభూమి గృహసంపర్క్ అభియాన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.. VIP యాక్సెస్‌ పొందేందుకు, హిందువులతో షేర్‌ చేసుకోండి. జై శ్రీ రామ్…అని ఉంది. ఇలాంటి మెసేజ్లు నిజమని నమ్మి భావించిన కొందరు భక్తులు ఊహించని విధంగా వారి చేతిలో మోసపోతున్నారు. అయితే ఈ మోసపూరిత ప్రచారానికి, రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం, ఈవెంట్ నిర్వాహకులు లేదా ఆలయ ట్రస్ట్‌కు ఎలాంటి సంబంధం లేదు.

రామ మందిరం ప్రారంభోత్సవానికి హాజరవ్వాలని కోరుకుంటున్న వారిని స్కామర్లు టార్గెట్ చేస్తున్నారు. జనవరి 22న ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తామని చెప్పే ఇలాంటి హానికరమైన APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేస్తే ముప్పు తప్పుదు. వీటి నుంచి ఎదురయ్యే రిస్కు, అందులో దాగి ఉన్న స్పెసిఫిక్‌ మాల్వేర్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పొరపాటున మీరు వారు పంపిన లింక్ పై క్లిక్ చేసి ఫైల్స్ డౌన్లోడ్ చేస్తే.. మాల్వేర్ లాగిన్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ కార్డ్ నంబర్లు, కాంటాక్ట్స్‌, బ్రౌజింగ్ హిస్టరీ, పర్సనల్ మెసేజ్‌లు వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరించగలదు. స్కామర్లు మీ డివైజ్‌పై నిఘా వేయడానికి మాల్వేర్‌ను ఉపయోగించవచ్చు. టైపింగ్, బ్రౌజింగ్, కెమెరా, మైక్రోఫోన్ వినియోగం వంటి కార్యకలాపాలను రహస్యంగా రికార్డ్ చేయవచ్చు.

యాప్‌ లను క్రాష్ చేయవచ్చు, మీ ఫోన్‌ను స్తంభింపజేయవచ్చు లేదా డేటాను ఎరేజ్‌ చేయవచ్చు. హానికరమైన ఫైల్‌లు మీ డివైజ్‌ లొకేషన్‌ని ట్రాక్ చేయగలవు. హ్యాకర్లు మీ కదలికలను పర్యవేక్షించడానికి, భవిష్యత్తులో మీ కార్యకలాపాల లక్ష్యంగా దాడులు చేయడానికి ఇలా ప్లాన్‌ చేసే అవకాశం ఉంది. ఈ APKలు బ్యాంకింగ్ యాప్‌లను లక్ష్యంగా చేసుకోవచ్చు, అకౌంట్‌ నంబర్‌లు, ట్రాన్సాక్షన్ల వివరాలు, వన్-టైమ్ పాస్‌వర్డ్‌లు వంటి ఆర్థిక డేటాను దొంగిలించవచ్చు. కాబట్టి ఈ విషయంపై దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.