Site icon HashtagU Telugu

Crystal Tortoise: క్రిస్టల్ తాబేలు ఈ దిశలో ఉంచితే చాలు.. మీ దశ తిరగడం ఖాయం!

Mixcollage 30 Dec 2024 12 50 Pm 2522

Mixcollage 30 Dec 2024 12 50 Pm 2522

చాలామంది తాంబేలు బొమ్మను ఇంట్లో పూజ గదిలో అలాగే హాల్లో పెట్టుకుంటూ ఉంటారు. పూజలు చేయడంతో పాటు ప్రత్యేకంగా ప్రత్యేకంగా పూలతో అలంకరిస్తూ ఉంటారు. తాబేలు విగ్రహం ఇంట్లో ఉంటే ఆర్థికంగా కలిసి వస్తుందని పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని,వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ముఖ్యంగా చాలామంది ఎక్కువగా క్రిస్టల్ తాబేలును ఇంట్లో పెట్టి ఉంటూ ఉంటారు. తాబేలు ప్రతిమను ఇంట్లో ఉంచుకుంటే సుఖ శాంతులు నెలకొంటాయని విశ్వాసం. ఈ తాబేలులో రకాలు ఉన్నాయి.

ఒకొక్క తాబేలుకి ఒకొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంట్లో క్రిస్టల్ తాబేలు ఏ దిశలో పెట్టుకుంటే శుభప్రదమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లోని వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే క్రిస్టల్ తాబేలును ఉత్తర దిశలో పెట్టుకుంటే ఇంట్లోకి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుందట. ఎందుకంటే ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు. కాబట్టి క్రిస్టల్ తాబేలు ఉత్తర దిశ‌ను చూస్తున్నట్లు పెడితే ఆ ఇంట్లో నివసించే వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆర్థికంగా బలపడతారని చెబుతున్నారు. అలాగే ఇంట్లో క్రిస్టల్ తాబేలు నైరుతి దిశలో పెట్టుకుంటే భార్య భర్తల మధ్యన ఉన్న కలహాలు సమసిపోతాయట.

అదేవిధంగా కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని చెబుతున్నారు. అలాగే క్రిస్టల్ తాబేలు నీటి ఫౌంటెన్ కు దగ్గరగా కానీ, నీరు ఉన్న తొట్టెలో కానీ ఉంచితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతుంది. వృత్తి పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా దూరమవుతాయని, సర్వత్రా విజయం చేకూరుతుందట. అయితే ఈ క్రిస్టల్ తాబేలును పొరపాటున కూడా ఆగ్నేయం ఈశాన్య దిశలలో అసలు పెట్టుకోకూడదట. ఇలా పెడితే వ్యతిరేక ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.