Site icon HashtagU Telugu

Crow: కాకి తలపై తన్నితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Crow

Crow

మామూలుగా ఎప్పుడైనా మనం బయటకు వెళ్తున్నప్పుడు లేదా అలా ఇంటి ఆవరణలో నిలబడినప్పుడు కాకులు తన్ని వెళ్తూ ఉంటారు. అయితే ఇలా కాకి తన్నినప్పుడు చాలా మంది వెంటనే తలస్నానం చేస్తూ ఉంటారు. ఇంకొందరు తల స్నానం చేసి గుడికి వెళుతూ ఉంటారు. ఇంతకీ కాకులు ఎందుకు తంతాయి. దాని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాకులు తలపై తన్నడానికి అసలు కారణం.. మనం మన పూర్వీకులను పూజించడం మర్చిపోయినా లేదా వారికి సరైన సమయంలో తిథి ఇవ్వడం మర్చిపోయినా వారు కాకి రూపంలో వచ్చి మనకు గుర్తు చేస్తారట. అంతేకాకుండా కాకి తలపై తన్నితే మీ జీవితంలో శని ప్రభావం మొదలు కాబోతోందని అర్థం.

ఇలా జరగడం వల్ల జీవితంలో మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోబోతున్నారని అర్ధం. అందుకే కాకి తలపై తన్నితే చాలా జాగ్రత్తగా ఉండాలట. మీ పూర్వీకులే కాకి రూపంలో వచ్చి మిమ్మల్ని ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నారని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. కాకి తలపై తన్నినప్పుడు మీరు ఇంటికి వెళ్లి తలపై నువ్వుల నూనె రాసుకుని కులదైవాన్ని పూజించాలట. అలాగే శని దేవున్ని శాంతపరచడానికి ఏదైనా నది, చెరువుల్లో స్నానం చేయడం మంచిది అని చెబుతున్నారు. ఆ తర్వాత భక్తిశ్రద్ధలతో శని దేవుని గుడికి వెళ్లి దీపం వెలిగించడం వల్ల శని దేవుడు మీ పై ఖచ్చితంగా దయ చూపుతాడట. అలాగే మీకు వీలైతే కాకులకు అన్నం పెట్టడం మంచిదని చెబుతున్నారు.

తర్వాత రాబోయే అమావాస్య రోజు మీ పూర్వీకులకు పిండం పెట్టి వారిని మనస్ఫూర్తిగా పూజించాలట. అలాగే మీకు ఉన్నంతలో సహాయం చేయడం మంచిదని ముఖ్యంగా దివ్యాంగులకు సహాయం చేయడం చాలా మంచిది అని చెబుతున్నారు. మీరు కాకికి ఆహారం పెడితే ఒకవేళ అది తింటే శుభసంకేతంగా పరిగణించాలట. దీనివల్ల మీ కోరికలన్నీ త్వరలోనే నెరవేరుతాయని అర్థం అంటున్నారు. అలాగే మీరు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కాకి నీళ్లు తాగడం చూసినట్టైతే అది శుభప్రదంగా పరిగణించబడుతుందట. ఇది మీరు బాగా డబ్బు సంపాదించబోతున్నారు అనడానికి అర్ధం అంటున్నారు. అలాగే మీ ఇంటికి తూర్పు దిక్కున ఉదయం పూట కాకి అరవడం కూడా శుభప్రదంగా భావించాలట. మీరు ఉద్యోగానికి వెళ్లేటప్పుడు కాకిని చూడటం కూడా మంచి సంకేతమని, ఆ రోజు మీరు చేసే పనులన్నీ నెరవేరబోతున్నాయని అర్థం అంటున్నారు. మీ ఇంటి బాల్కనీలో కాకి తన నోట్లో ఏదైనా పెట్టుకుని వస్తే దాన్ని కూడా శుభప్రదంగా భావిస్తారు. దీని వల్ల మీ ఇంట్లో అదృష్టం, సంపదలు పెరుగుతాయని చెబుతున్నారు.