Site icon HashtagU Telugu

Crassula Plant: మనీప్లాంట్ కంటే మేలు చేసే మొక్క ఉంటే చాలు.. అంతా అదృష్టమే?

Plants For Progress

Plants For Progress

చాలామంది ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి ఇంట్లో రకరకాల మొక్కలను పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు.. చాలామంది ఇంటిని మొత్తం పూల మొక్కలతో అలంకరిస్తూ ఉంటారు. కొందరు మాత్రం వాస్తు శాస్త్ర ప్రకారంగా కొన్ని మొక్కలు మాత్రమే నాటుతూ ఉంటారు. ఇంట్లో మొక్కలు ఉండటం వల్ల మనసుకు ఆహ్లాదకరంగా అనిపించడంతో పాటు ప్రశాంతంగా ఉంటుంది. ఇకపోతే ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇళ్లలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటూ ఉంటారు. ఇండోర్, అవుట్ డోర్ లలో మొక్కను ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు.

మనీ ప్లాంట్ మొక్కను లక్ష్మి దేవి స్వరూపంగా భావిస్తారు. ఆ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మన సంపద కూడా అంత బాగా పెరుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు.. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవాలి అనుకుంటూ ఉంటారు. అయితే ఆర్థిక పరిస్థితులను దూరం చేయడంలో కేవలం మనీ ప్లాంట్ మొక్క మాత్రమే కాకుండా ఇంకా కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో లేదా ఆఫీసులో కొన్ని మొక్కలు నాటితే లైఫ్‌లో ఆనందం, శాంతిని కలిగిస్తుందట. అటువంటి మొక్కలలో క్రాసులా మొక్క. కూడా ఒకటి. ఇది ఇంట్లో ఉంచడం వలన ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది.

క్రాసులా మొక్కను అద్భుతమైనదిగా, శుభప్రదంగా కూడా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ కంటే క్రాసులా మొక్క చాలా ప్రభావవంతమైనది, పవిత్రమైనది, ప్రయోజనకరమైనది కూడా. ఇది ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే సంపద ప్రవాహానికి కొత్త మార్గాలు కూడా తెరచుకుంటాయి. ఇంట్లో లేదా ఆఫీసులో ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ ఇంట్లో డబ్బులు నిలవకపోతే క్రాసులా మొక్కను నాటవచ్చు.

Exit mobile version