Site icon HashtagU Telugu

Cremation Rules: అంత్యక్రియలు అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదా.. చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Mixcollage 09 Dec 2023 07 13 Pm 475

Mixcollage 09 Dec 2023 07 13 Pm 475

మాములుగా అంత్యక్రియలకు, దహన సంస్కారాలకు హాజరైన తర్వాత లేదా అంత్యక్రియలు చేసిన తర్వాత చేయ‌వ‌ల‌సిన విధులు, చేయకూడ‌ని ప‌నులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తి అంతిమ సంస్కారాలు, అన్ని ఆచారాలు ముగిసిన తర్వాత ఆత్మ బయలుదేరి దైవంలో కలిసి పోతుంది. తద్వారా ఆ జీవికి ప్రపంచంతో ఉన్న అన్ని సంబంధాలు తొల‌గిపోతాయి. అంత్యక్రియలు, దహన సంస్కారాలకు సంబంధించిన ఈ నియమాలు ఎందుకు రూపొందించారు. ఈ నిబంధనల వెనుక ఏదైనా మత విశ్వాసం లేదా ఏదైనా శాస్త్రీయ కోణం ఉందా? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

దహన సంస్కారాలకు వెళ్లినప్పుడు ఎక్కువగా తెల్లని దుస్తులు ధరిస్తూ ఉంటారు. అయితే ఇలా ధరించడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. నిజానికి, తెలుపు రంగు స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఇది శాంతిని, పరిశుభ్రతను సూచిస్తుంది. ఈ రంగు ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతుంది, సానుకూల శక్తి ప్రకాశాన్ని బలపరుస్తుంది. ఒకరి దహన సంస్కారాలకు హాజరయ్యేందుకు ప్రజలు శ్మశానవాటికకు వెళ్లినప్పుడు, అక్కడ ఉన్న ప్రతికూల శక్తులు వారికి దూరంగా ఉండేందుకు తెల్లని దుస్తులు ధరిస్తారు. అలాగే అంతిమ సంస్కారాలు, ఆత్మ మరణానంతర జీవితం గురించి గరుడ పురాణంలో వివరణాత్మక వర్ణన ఉంది. ఈ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి అంత్యక్రియల నుంచి తిరిగి వస్తున్నప్పుడు పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకూడదు.

ఇలా చేయడం ద్వారా, మరణించిన వ్యక్తి ఆత్మ చూసేవారితో ప్రేమలో పడుతుంది. తన నిష్క్రమణ కారణంగా ఆ వ్యక్తి మాత్రమే విచారంగా ఉన్నాడని ఆత్మ భావిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆ ఆత్మ శాంతిని పొందదు, ఆ వ్య‌క్తితో అనుబంధాన్ని పెంచుకుంటుంది. ఆ ఆత్మ ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటుంది. అదేవిధంగా ఒక వ్యక్తి అంత్యక్రియలు లేదా దహన సంస్కారాలకు హాజరైన తర్వాత తిరిగి వచ్చిన వెంటనే స్నానం చేయాలి. దీనితో పాటు దహన సంస్కారాల సమయంలో ధ‌రించిన దుస్తులు ఉతకాలి. దీని తర్వాత గంగాజలం ఇల్లంతా చల్లాలి. ఇవన్నీ చేయడానికి కారణం శ్మశానవాటికలో అనేక రకాల ప్రతికూల శక్తులు నివసిస్తాయి, అవి మీ దుస్తుల ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తాయి. స్నానం చేయడంతో పాటు గంగాజలం ఇల్లంతా చ‌ల్ల‌డం ద్వారా ఈ ప్రతికూల శక్తుల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది..