Cow: గోమాతకు నానబెట్టి ఉలవలను తినిపిస్తే చాలు.. ఆ సమస్యలన్నీ మాయం?

మామూలుగా హిందువులు గోవులను దేవతలుగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. పల్లెటూర్లలో ఉన్న వారికి గోవులు అందుబాటులో ఉంటాయి కాబట్టి పూజలు చే

  • Written By:
  • Publish Date - August 10, 2023 / 09:00 PM IST

మామూలుగా హిందువులు గోవులను దేవతలుగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. పల్లెటూర్లలో ఉన్న వారికి గోవులు అందుబాటులో ఉంటాయి కాబట్టి పూజలు చేస్తూ ఉంటారు. ఇక సిటీలలో ఉన్నవారు ప్రత్యేకించి గోషాలకు వెళ్లి మరి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. గోవులు సాక్షాత్తు దైవస్వరూపాలుగా భావిస్తారు. సమస్త దేవతలకు ప్రతీకగా గోవును ఆరాధిస్తారు. గోవుల నుంచి వచ్చే ఏ పదార్థం అయినా మానవునికి ఉపయోగపడేవిగా ఉండటం విశేషం. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని పండితులు కూడా చెబుతూ ఉంటారు.

కాబట్టి ఆవును పూజిస్తే దేవతలందరినీ పూజించినట్లే. ఆవులకు ప్రధాన ఆహారంగా గడ్డిని పెడుతూ ఉంటారు. ఎప్పుడూ గడ్డి మాత్రమే కాకుండా అప్పుడప్పుడు బెల్లంతో చేసిన వంటకాలు బియ్యంతో చేసిన వంటకాలను పెట్టడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా నానబెట్టిన ఉలవలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసే వృత్తిలో నిలకడగా ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను ఆహారంగా పెట్టడం వల్ల ధనం అభివృద్ధి చెందుతుంది. నానబెట్టిన గోధుమలను ఆహారంగా పెట్టడం వల్ల మన కీర్తి పెరుగుతుంది.

బియ్యప్పిండి బెల్లం కొంచెం నీటితో కలిపి ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. నానబెట్టిన శనగలు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి, బెల్లము కొంచెం నీటితో కలిపి పెడితే దారిద్ర్యం తొలగిపోతుంది. అలాగే నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది. ఉడికించిన ఆలుగడ్డలను ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అంతే కాకుండా మనం భోజనం చేసేటప్పుడు కూడా మొదటి ముద్ద గోమాతలకి చివరి ముద్ద కుక్కకు పెట్టడం వల్ల ఎన్నో మంచి మంచి ప్రయోజనాలు కలుగుతాయి.