Srisailam: శ్రీశైలం ఆలయ హుండీల లెక్కింపు, ఎంత నగదు వచ్చిందంటే

Srisailam: భక్తుల కోరికలు శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం ఎంతోమంది భక్తులు తరలివస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా, పొరుగు రాష్ట్రాల ప్రజలు శివయ్య దర్శనం కోసం వస్తుంటారు. అయితే భారీస్థాయిలో తరలివచ్చే భక్తులు కానుకలు కూడా భారీగానే సమర్పిస్తుంటారు. అయితే గురువారం రోజున జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.1,81,13,485/- నగదు రాబడిగా లభించింది. కాగా ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 18 రోజులలో (12.03.2024 నుండి 27.03.2024 వరకు) సమర్పించడం జరిగింది. […]

Published By: HashtagU Telugu Desk
Srisailam

Srisailam

Srisailam: భక్తుల కోరికలు శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం ఎంతోమంది భక్తులు తరలివస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా, పొరుగు రాష్ట్రాల ప్రజలు శివయ్య దర్శనం కోసం వస్తుంటారు. అయితే భారీస్థాయిలో తరలివచ్చే భక్తులు కానుకలు కూడా భారీగానే సమర్పిస్తుంటారు. అయితే గురువారం రోజున జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.1,81,13,485/- నగదు రాబడిగా లభించింది. కాగా ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 18 రోజులలో (12.03.2024 నుండి 27.03.2024 వరకు) సమర్పించడం జరిగింది.

అదేవిధంగా 178 – యుఎస్ డాలర్లు, 20 సాదిఆరేబియా రియాల్స్ 20 – యు.కె. ఫౌండ్సు 5 – ఆస్ట్రేలియా డాలర్లు, 100- స్వీడన్ జోనర్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.

  Last Updated: 28 Mar 2024, 11:36 PM IST