Site icon HashtagU Telugu

Copper Utensils Worship: పూజలో రాగి పాత్రలను ఉపయోగించడం వెనుకున్న ఆంతర్యం ఇదే?

Copper

Copper

Copper Utensils Worship: సాధారణంగా పూజ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు. కొంతమంది రాగి పాత్రలను ఉపయోగించి పూజలు చేస్తుంటారు. మరి కొంతమంది ఇత్తడి పాత్రలను ఉపయోగించి పూజ చేస్తుంటారు. ఇంకొందరు మట్టి ప్రమిదలు అలాగే స్టీల్ వి కూడా ఉపయోగించి పూజలు చేస్తుంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక విధమైన పాత్రలను ఉపయోగించి పూజలు చేస్తూ ఉంటారు. అయితే చాలావరకు పూజలలో ఎక్కువగా రాగి పాత్రలను ఉపయోగిస్తూ ఉంటారు. మరి రాగి పాత్రలను పూజలో ఎందుకు ఉపయోగిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పురాతన కాలం రాగి పాత్రలను ఉపయోగిస్తూ ఉన్నారు. అందుకే చాలామంది రాత్రిళ్ళు రాగి పాత్రలో నీరు పోసి ఉదయం లేవగానే ఆ నీటిని తాగుతూ ఉంటారు. అలా రాగి పాత్రలోని నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు దరి చేరవు అని నమ్ముతూ ఉంటారు. రాగి పాత్రలోని నీరు సేవిస్తే రక్త శుద్ధి జరిగి శరీరం ఇమ్యూనిటీ పెరుగుతుంది అని కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి రాగికీ పురాణాల ప్రకారంగా ప్రాధాన్యతను ఉంది. అదేమిటంటే పురాణాల ప్రకారం గుడాకేశుడు అనే రాక్షసుడు ఉండేవాడట.

అయితే గుడాకేశుడు విష్ణు కోసం రాగి రూపంలో తపస్సు చేయగా విష్ణువు గుడాకేశుడి తప్పసుకి విష్ణు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని చెబుతాడు. అప్పుడు గుడాకేశుడు తనకు ఎటువంటి వరం వద్దని తన శరీరాన్ని సుదర్శన చక్రంతో ఖండించి నీలో(విష్ణువు) లో ఐక్యం చేసుకో విష్ణువుని కోరతాడట. ఆత్మ విష్ణువులో ఐక్యం అయిన తరువాత తన శరీరంతో చేసిన వస్తువులను పూజకు వినియోగించాలని కోరతాడట. ఆ విధంగా పూజా సమయంలో రాగి పాత్రల వినియోగం వాడుకలోకి వచ్చింది. కాబట్టి అప్పటినుంచి చాలామంది పూజల్లో రాగిపాత్రలనీ ఉపయోగించడం మొదలుపెట్టారు.