Saleshwaram Jatara : శివ భక్తురాలిని 4 కి.మీ మోసుకెళ్లిన కానిస్టేబుల్

సలేశ్వరం జాతర ముగింపు సందర్భంగా.. నాగర్ కర్నూల్‌కు చెందిన 75 నుంచి 80 సంవత్సరాలు గల వృద్ధురాలు నడవలేని పరిస్థితులలో అవస్థలు పడడం చూసిన కానిస్టేబుల్ రాందాస్ చలించిపోయాడు

Published By: HashtagU Telugu Desk
Constable Ramdas Helps Old

Constable Ramdas Helps Old

శివ భక్తురాలిని 4 కి.మీ మోసుకెళ్లిన కానిస్టేబుల్ రాందాస్ (Constable Ramdas) ఫై యావత్ భక్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రీశైలానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సలేశ్వరం.. ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం. చారిత్రిక ప్రాముఖ్యత గల ఈ ఆధ్యాత్మిక ప్రదేశం..శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యత్రాస్థలం. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత చైత్ర పౌర్ణమికి మొదలవుతుంది. అడవిలో 25 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి వుంటుంది. ఇందులో 20 కిలోమీటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది. అక్కడి నుండి 5 కిలొమిటర్ల కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో వున్న గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్ధులు అవుతారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఏడాది కూడా నాల్గు రోజుల పాటు జరిగిన ఈ జాతర బుధువారంతో ముగిసింది. ఈ జాతరకు 70 ఏళ్ల వృద్ధురాలు (Old Woman) వచ్చారు. శివుడిని దర్శించుకున్న అనంతరం తిరుగుప్రయాణంలో కొండల్లో నడిచేందుకు ఆమె ఇబ్బంది పడింది. ఇది గమనించిన కానిస్టేబుల్ ఎత్తుకొని కొండపైకి మోసుకొచ్చారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుండడం తో ప్రతి ఒక్కరు కానిస్టేబుల్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. అచ్చంపేట సర్కిల్ పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రామావత్ రాందాస్..ఈ పని చేసి..మానవత్వం చాటుకున్నాడు. సలేశ్వరం జాతర ముగింపు సందర్భంగా.. నాగర్ కర్నూల్‌కు చెందిన 75 నుంచి 80 సంవత్సరాలు గల వృద్ధురాలు నడవలేని పరిస్థితులలో అవస్థలు పడడం చూసిన కానిస్టేబుల్ రాందాస్ చలించిపోయాడు. తన ఉన్నతాధికారి అయిన అచ్చంపేట సీఐ రవీందర్ అనుమతితో ఆ వృద్ద మహిళను సలేశ్వరం జాతరలోని గుండం నుండి పైకి తన భుజాలపై మూసుకుంటూ వచ్చి నగర్ కర్నూల్ కు పంపించడం జరిగింది. ఇది చూసిన అక్కడి భక్తులే కాదు సోషల్ మీడియా లో చూసిన నెటిజన్లు సైతం రాందాస్ ఫై ప్రశంసలు కురిపిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఇదే కానిస్టేబుల్ తొక్కిసలాటలో గాయపడ్డ ఇద్దరు భక్తులను మోసుకెళ్లి కాపాడినట్లు చెపుతున్నారు.

Read Also : Banks New Rules : మే నుంచి మారనున్న బ్యాంకు రూల్స్ ఇవే

  Last Updated: 27 Apr 2024, 01:06 PM IST