Diwali 2024 : దీపావళి ఎప్పుడు ? ఏ తేదీన పండుగను జరుపుకోవాలి ? అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈనెల 31నే దీపావళిని జరుపుకోవాలని కొందరు పండితులు చెబుతుంటే.. నవంబరు 1న పండుగను జరుపుకోవాలని మరికొందరు పండితులు అంటున్నారు. ఈ వేర్వేరు అభిప్రాయాల నడుమ ప్రజలు కొంత గందరగోళానికి లోనవుతున్నారు.
Also Read :India VS Canada : భారత్‌పై అక్కసు.. కెనడా ప్రధానికి ఖలిస్తానీ ఉగ్రవాది లేఖ వైరల్
సాధారణంగానైతే దీపావళి పండుగను ఏటా ఆశ్వయుజ మాసంలో అమావాస్య తిథినాడు జరుపుకుంటారు. ఈసారి దీపావళికి సంబంధించిన అమావాస్య తిథి అక్టోబర్ 31న వస్తుందా ? నవంబర్ 1న వస్తుందా ? అనే దానిపై గందరగోళం నెలకొంది. వేద క్యాలెండర్ ప్రకారం అమావాస్య తిథి అక్టోబర్ 31న మధ్యాహ్నం 3:12 గంటల నుంచి నవంబర్ 1న సాయంత్రం 5:14 గంటల వరకు ఉంటుంది.
Also Read :Citizenship Act : పౌరసత్వ చట్టంలోని ‘సెక్షన్ 6ఏ’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
అమావాస్య తిథి, ప్రదోష కాలం, శుభ సమయాలు అన్నీ కలిసొచ్చిన అక్టోబర్ 31వ తేదీనే దీపావళి పండుగను జరుపుకోవాలని పలువురు పండితులు అంటున్నారు. కొందరు పంచాంగకర్తలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ద్రుక్ సిద్ధాంత పంచాంగం ప్రకారం నవంబర్ 1వ తేదీన దీపావళి జరుపుకోవాలని అంటున్నారు. లక్ష్మీదేవి సూర్యోదయ సమయంలోనే వస్తుందని, ఆ కారణం వల్ల అమావాస్య తిథిలో ఉదయం సమయమున్న నవంబర్ 1వ తేదీన దీపావళిని సెలబ్రేట్ చేసుకోవాలని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే దీపావళి పండుగ తేదీపై(Diwali 2024) ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. మొత్తం మీద ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Also Read :Haryana : హర్యానా సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన నాయాబ్ సైని
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.