Makar Sankranti 2026 : భోగి 2026 తేదీ లో కన్ఫ్యూజన్‌! .. భోగి పండుగ ఎప్పుడు జరుపుకోవాలో క్లారిటీ ఇదే..

హిందూ సంప్రదాయం ప్రకారం మకర సంక్రాంతి (Makar Sankranti 2026) పండుగకు ముందు రోజున భోగి పండుగను ఘనంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో సంక్రాంతి అతిపెద్ద పండుగ. నాలుగు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజు జరుపుకునే పండుగ భోగి. ఈ విశిష్టమైన రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి భోగి మంటలు వేస్తారు. చిన్నారులపై భోగి పళ్లు పోస్తారు. భోగి పండుగ రోజు సాయంకాలం బొమ్మల కొలువు కూడా జరుపుతారు. […]

Published By: HashtagU Telugu Desk
Makar Sankranti 2026

Makar Sankranti 2026

హిందూ సంప్రదాయం ప్రకారం మకర సంక్రాంతి (Makar Sankranti 2026) పండుగకు ముందు రోజున భోగి పండుగను ఘనంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో సంక్రాంతి అతిపెద్ద పండుగ. నాలుగు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజు జరుపుకునే పండుగ భోగి. ఈ విశిష్టమైన రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి భోగి మంటలు వేస్తారు. చిన్నారులపై భోగి పళ్లు పోస్తారు. భోగి పండుగ రోజు సాయంకాలం బొమ్మల కొలువు కూడా జరుపుతారు.

హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి  గా పరిగణిస్తారు. మకర సంక్రాంతి పండుగకి ముందు రోజు భోగి పండుగ (Bhogi Festival 2026) జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది 2026లో భోగి 2026 పండుగ జనవరి 14వ తేదీ బుధవారం జరుపుకోనున్నారు. ప్రభుత్వాలు సైతం జనవరి 14వ తేదీన భోగి పండుగ సెలవుగా ప్రకటించారు. భోగి పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఉత్సాహంగా జరుపుకుంటారు.

భోగి 2026 తేదీ

Bhogi 2026

2026 కొత్త సంవత్సరం భోగి పండుగ జనవరి 14వ తేదీ బుధవారం రోజు వచ్చింది. ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యే ముందు రోజు బాగా ఎక్కువగా చలి ఉంటుంది. ఆ చలిని తట్టుకోవడానికి భోగి మంటలు వేస్తారు. అలాగే దక్షిణాయనం సమయంలో పడిన కష్టాలు, బాధలు తొలగి ఉత్తరాయణ పుణ్యకాలంలో సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు. అంతే కాకుండా ధనుర్మాస వ్రతం సైతం భోగి పండుగతోనే ముగుస్తుంది. అలాగే భోగి పండుగ రోజు సూర్యాస్తమయంలోపు చిన్న పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. అలాగే చెరుకు ముక్కలు, రేగుపండ్లు, చిల్లర కాసులు కలిపి పిల్లల తలపై పోస్తారు. కొంత మంది ఇరుగుపొరుగు వారిని పిలిచి వాయునాలు సైతం ఇస్తారు. భోగి పండుగ రోజు ఇంద్ర దేవుడు, వరుణ దేవుడిని కూడా పూజిస్తారు. వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలు బాగా పండాలని కోరుకుంటారు. భోగి పండుగ రోజు సాయంకాలం వేళ బొమ్మల కొలువు కూడా జరుపుతారు.

 

భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి (Bhogi) అనే పదం వచ్చిందని తెలుస్తోంది. భోగం అంటే సుఖం అని కూడా. పురాణ కథనాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామి వారిలో గోదా దేవి లీనమై భోగాన్ని పొందిందని అందుకు సంకేతంగానే భోగి పండుగ ఆచరణలోకి వచ్చినట్లు కూడా చెబుతారు. మరో కథనం ఏమిటంటే.. శ్రీమహావిష్ణువు వామనుడి అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి అణగతొక్కింది కూడా భోగి రోజునే అని నానుడి. మరోవైపు శ్రీకృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన రోజు కూడా భోగి పండుగ రోజే అని చెబుతారు. అంతే కాకుండా ఈశ్వరుడు రైతుల కోసం నందిని భోగి పండుగ రోజు భూమిపైకి పంపారని కూడా చెబుతుంటారు. ఇలా ఎన్నో విశేషాల సమాహారమే ఈ భోగి పండుగ.

మకర సంక్రాంతి 2026 తేదీ

Sankranti 2026

 

భోగి పండుగ రోజు తర్వాత రోజు మకర సంక్రాంతి (Makar Sankranti Festival 2026). ఈ రోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. కొత్త సంవత్సరం 2026 జనవరి 15వ తేదీ గురువారం రోజు సంక్రాంతి పండుగ (Sankranti Festival 2026) జరుపుకోనున్నారు. మకర సంక్రాంతి రోజు దానధర్మాలు చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని విశ్వాసం. అలాగే గుమ్మడికాయ దానం చేస్తే పితృదేవతలు సైతం సంతృప్తి చెందుతారట. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నువ్వులు తింటే ఆయుష్షు పెరుగుతుందని కూడా చెబుతారు.

కనుమ పండుగ 2026 తేదీ

Kanuma 2026

కొత్త ఏడాది 2026లో కనుమ పండుగ జనవరి 16వ తేదీ శుక్రవారం జరుపుకోనున్నారు. రైతులు పంట చేతికి రావడానికి పడే కష్టం అంతా ఇంతా కాదు. రైతులు పడే ఆ కష్టంలో పశువుల సాయం వెలకట్టలేనిది. రైతు ఆనందం కోసం పశువులు ఎంతగానో శ్రమిస్తాయి. వ్యవసాయం చేయడంలోనే కాకుండా పాడి రూపంలో కూడా గోమాతలు రైతన్నను అన్నీవిధాల ఆదుకుంటాయి. ఇలా తమ కష్టసుఖాలకు, సంతోషాలకు, సంపదలకు కారణమైన పశువులకు కృతజ్ఞతతో పూజించడమే ఈ కనుమ పండుగ ముఖ్య ఉద్దేశం. అందుకే కనుమ పండుగను చాలా చోట్ల పశువుల పండుగ అని కూడా అంటారు. ఈ కనుమ పండుగ రోజు రైతులు పశుశాలలను శుభ్రం చేయడం, ఆవులు, గేదెలను శుభ్రంగా కడగడం, పసుపు రాయడం, పువ్వులు కుంకుమతో అలంకరించడం చేస్తారు.

 

  Last Updated: 09 Dec 2025, 10:38 AM IST