Site icon HashtagU Telugu

Lakshmidevi: శ్రీ మహాలక్ష్మీదేవికి ఎలాంటి పనులు అంటే ఇష్టం లేదో మీకు తెలుసా?

209268d7 02db 41d6 91b1 523dcdff1c18

209268d7 02db 41d6 91b1 523dcdff1c18

మామూలుగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలామంది ఎన్నెన్నో పూజలు పరిహారాలు వ్రతాలు వంటివి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కొన్ని కొన్ని సార్లు అమ్మవారి అనుగ్రహం లభించదు. అయితే మంచి పనులు చేయడంతో పాటు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా అమ్మవారికి అసలు ఇష్టం ఉండదట. ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి దేవికి కొన్ని రకాల పనులు చేయడం అస్సలు ఇష్టం ఉండదని చెబుతున్నారు పండితులు. మరి ఎలాంటి పనులు చేస్తే అమ్మవారికి నచ్చదో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

ఎప్పుడూ కూడా మంచంపై కూర్చుని భోజనం చేయకూడదట. కింద కూర్చుని అలవాటు లేక మంచంపై కూర్చుని భోజనం చేస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదట. ఎన్ని పనులు ఉన్నా సరే ఉదయాన్నే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు. అలా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోకపోతే అమ్మవారికి ఇష్టం ఉండదట. ఇంట్లో ఎప్పుడూ కూడా ఇల్లాలు భర్తని పిల్లల్ని వేసుకోవడం లాంటివి చేయకూడదని చెబుతున్నారు. సంధ్యా సమయంలో సంధ్యా దీపాన్ని పెట్టకపోవడం కూడా అమ్మవారికి నచ్చదట.

ఆహారాన్ని తీసుకోకముందు అలాగే తీసుకున్న తర్వాత తప్పనిసరిగా నోటిని శుభ్రం చేసుకోవాలని అలా శుభ్రం చేసుకోకపోవడం అమ్మవారికి నచ్చదని చెబుతున్నారు. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ముఖం కడుక్కోకుండా భర్తకు భార్య కనపడటం వల్ల అనారోగ్యం, ధనహీనత కలుగుతాయని కాబట్టి అలాంటి పొరపాటు అస్సలు చేయకూడదని చెబుతున్నారు. తడిబట్టలతో భోజనం చేయడం అమ్మవారికి ఇష్టం ఉండదట. తమలపాకు కంటే ముందు వక్కలను నమ్మడం కూడా దరిద్రాన్ని తెస్తాయని చెబుతున్నారు.